రోజులో ఎక్కువ గంటలు కుర్చీలో కూర్చుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 11, 2024, 1:07 PM IST

ఈ రోజుల్లో చాలా మంది  రోజుల్లో దాదాపు 8 నుంచి 12 గంటలు కుర్చీలో కూర్చొని పని చేస్తుంటారు. అయితే..  కుర్చీ లో సరిగా కూర్చోకపోయినా, ఆ కుర్చీ సరిగా లేకపోయినా.. తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని మీకు తెలుసా?

ఈ రోజుల్లో  దాదాపు అందరూ చేసేవి కూర్చొని చేసే పనులే.  రోజులో గంటలు గంటలు కుర్చీల్లో కూర్చొని పనులు చేస్తున్నారు. కూర్చొని పని చేయడం కూడా కష్టమేనా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ...కూర్చొనే పద్దతి సరిగా లేకపోతే మాత్రం.. తిప్పలు పడకతప్పదు. మీరు చదివింది నిజమే. ఈ రోజుల్లో చాలా మంది  రోజుల్లో దాదాపు 8 నుంచి 12 గంటలు కుర్చీలో కూర్చొని పని చేస్తుంటారు. అయితే..  కుర్చీ లో సరిగా కూర్చోకపోయినా, ఆ కుర్చీ సరిగా లేకపోయినా.. తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని మీకు తెలుసా?


అవును, మీరు ఎటువంటి కదలిక లేకుండా ఎక్కువసేపు కుర్చీపై కూర్చుంటే.. అధిక బరువు పెరిగిపోతారు.  మీ శరీరం ఊబకాయానికి దారి తీస్తుంది.  మీరు సరిగ్గా కుర్చీపై కూర్చోకుండా గంటల తరబడి పని చేస్తే, అది మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది, కూర్చోవడం కూడా కాళ్ళకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.
కుర్చీపై కూర్చొని కంప్యూటర్‌లో పని చేస్తూ, కీబోర్డ్‌పై నిరంతరం వేళ్లను కదిలించే వ్యక్తులు చేతులు, భుజాలలో నొప్పిని అనుభవిస్తారు.
 


గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం కూడా రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కుర్చీపై కూర్చొని పని చేస్తున్నప్పుడు భుజాలు, పొత్తికడుపు, తుంటి భాగాల్లో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో జలదరింపు లేదా తిమ్మిరి వంటి సాధారణ సమస్యలు వస్తాయి.


కూర్చున్న కుర్చీ మీ దిగువ వీపుకు మద్దతు ఇవ్వకపోతే , మీరు వెనుక మద్దతు లేకుండా కుర్చీపై కూర్చుంటే, అది మీ తుంటిలో నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి మెడ నుండి మొదలై వెన్ను ఎముక వరకు వెళుతుంది.

Latest Videos

click me!