అల్లం, వెల్లుల్లిలో తేనె కలుపుకుని తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 11, 2024, 10:10 AM IST

అల్లం, వెల్లుల్లి, తేనె మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ మూడింటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని కలిపి తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా? 
 

మన ఇండ్లలో ఖచ్చితంగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ కూరలో వేస్తుంటాం. కూరలు మరింత టేస్టీగా అయ్యేందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఇది ఇంతకంటే ముందు మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. అయితే ఈ రెండింటిని తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

వాంతులు, వికారం నుంచి ఉపశమనం

చాలా మందికి వికారంగా ఉంటుంది. వాంతులు అవుతుంటాయి. అయితే ఇలాంటి వారికి అల్లం, వెల్లుల్లి, తేనె కాంబినేషన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును ఈ మూడింటిని కలిపి తింటే వికారం, వాంతుల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, జ్వరం, దగ్గు, జలుబు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఇలాంటి వారు రోగనిరోధక  శక్తిని ఖచ్చితంగా పెంచుకోవాలి.

అయితే అల్లం, వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
 

Latest Videos


ginger garlic

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం

చలికాలం, వానాకాలంలో దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల చాలా సార్లు జ్వరం కూడా వస్తుంటుంది.

అయితే అల్లం, వెల్లుల్లిలో తేనె కలుపుకుని తింటే దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి కూడా చాలా వరకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటారు. ఈ కాంబినేషన్ మీకు సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

బాడీ డిటాక్స్

అల్లం, వెల్లుల్లిలో తేనెను కలుపుకుని తింటే మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దీంతో మీరు హెల్తీగా ఉంటారు. 
 

ఆరోగ్యకరమైన గుండె

ఈ రోజుల్లో పెద్దలే కాదు చిన్న చిన్న పిల్లలు కూడా గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుతో ఉన్నపాటుగా చనిపోయిన ఘటనలు నిత్యం వార్తల్లో, సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. దీనికి అసలు కారణం మన జీవన శైలి సరిగ్గా లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారాలను తినకపోవడమే.

అయితే అల్లం, వెల్లుల్లి, తేనెలో ఉండే ఔషదగుణాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 


విరేచనాల నుంచి ఉపశమనం

విరేచనాల వల్ల శరీరంలో బలం తగ్గుతుంది. నీరసంగా ఉంటుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారికి అల్లం, వెల్లుల్లి, తేనె ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ మూడింటిని కలిపి తినడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. ఇది కడుపునకు సంబంధించిన సమస్యల నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. 

ఎలా తినాలి?

కొద్దిగా అల్లాన్ని, వెల్లుల్లిని తీసుకుని మెత్తగా రుబ్బండి. దీనిలో టీస్పూన్ తేనెతో కలిపి తినండి. కావాలనుకుంటే ఈ మూడింటి సిరప్ కూడా కూడా మీరు తాగొచ్చు. ఇలా చేసినా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

అయితే మీకు ఎలాంటి శారీరక సమస్య ఉన్నా లేదా అలెర్జీ ఉన్నా.. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని తీసుకోండి. 

click me!