belly button
హెల్తీగా, ఫిట్ గా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటుగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమ్మమ్మలు, నానమ్మలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఇంటి చిట్కాలతోనే తగ్గించడం మనం రోజూ చూస్తేనే ఉంటాం.
belly button
అయితే మన వంటగదిలో ఉండే ఎన్నో వస్తువుల్లో కూడా చాలా ఔషధ గుణాలుంటాయి. మనం వీటిని సక్రమంగా వాడితే ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చంటారు నిపుణులు. చిన్న పిల్లలకు కడుపునొప్పి వచ్చినప్పుడు నానమ్మకానీ, అమ్మమ్మ కానీ బొడ్డును నూనె రాయడం మీరు చూసే ఉంటారు.
నిజానికి బొడ్డులో కొన్ని చుక్కల నూనెను వేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇంగువ, ఆవనూనెను బొడ్డుకు రాస్తే ఎంతో మేలు జరుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
belly button
ఆవనూనె, ఇంగువ బొడ్డుకు రాసుకుంటే ఏమవుతుంది?
ఇంగువ, ఆవనూనెను బొడ్డుకు రాయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. గ్యాస్ ట్రబుల్ వల్ల కడుపుగా బరువుగా, నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుంటుంది. అయితే మీరు బొడ్డుకు ఇంగువ, ఆవనూనెను రాయడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మలబద్దకం, తిన్నది సరిగ్గా జీర్ణం కానీ వారు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు దీన్ని బొడ్డుకు అప్లై చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవనూనె, ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని నియంత్రిస్తాయి. పుల్లని త్రేన్పులను ఆపుతాయి.
belly button
ఆవనూనెలో విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. దీన్ని నాభిలో కొన్ని చుక్కలు వేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి శరీరం నిర్విషీకరణ చెందుతుంది. పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడానికి కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే తిన్నది బాగా జీర్ణమవుతుంది.
బొడ్డుకు ఆవనూనె, ఇంగువను ఎలా అప్లై చేయాలి?
ఇందుకోసం ముందుగా ఒక టీస్పూన్ ఆవనూనెను తీసుకుని అందులో చిటికెడు ఇంగువను వేసి కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను బొడ్డుకు అప్లై చేయండి. అలాగే బొడ్డు చుట్టూ కొద్దిసేపు మసాజ్ చేయండి.