తేనెను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Aug 14, 2023, 01:12 PM IST

చక్కెరనే బరువు పెంచుతది.. తేనె బరువును తగ్గిస్తదనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ తేనె కూడా మీ బరువును పెంచుచతుంది. అంతేకాదు..   

PREV
17
తేనెను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

తేనెలో ఎన్నో పోషక గుణాలున్నాయి. చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం తేనె. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలా మంది చక్కెరకు బదులుగా తేనెను తీసుకుంటారు. అయితే తేనెను మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

27
honey

బ్లడ్ షుగర్ 

నిజానికి తేనె మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. కానీ దీనిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు తేనెను మరీ ఎక్కువగా తినకూడదు. అలాగే మీ ఆహారంలో చేర్చే ముందు నిపుణులను సంప్రదించాలి.

37

బరువు

తేనెలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరలు బరువు పెరగడానికి దారితీస్తాయి. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోజువారీ కేలరీల  సంఖ్య పెరుగుతుంది. తేనెను ఎక్కువగా తీసుకోవడం లేదా తేనెను నీరు లేదా నిమ్మరసంతో కలపకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

47

హైపోటెన్షన్ 

తేనెలోని యాంటీఆక్సిడెంట్లు అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. కానీ దీనిని మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోటెన్షన్ ప్రమాదం పెరుగుతుంది.  అంటే మీ బీపీ చాలా పడిపోతుంది.
 

57

దంతక్షయం

తేనెను ఎక్కువగా తీసుకోవడం నోటి ఆరోగ్యానికి మంచిది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే తేనె దంతాలకు అంటుకుంటుంది. అలాగే ఇది దంత క్షయానికి కారణమవుతుంది. ఎక్కువ తేనె  దంతాల ఎనామెల్ ను నాశనం చేస్తుంది. అలాగే వాటిని బలహీనపరుస్తుంది. ఇది దంతాలలో రంగు మారడానికి కూడా కారణమవుతుంది. తేనె కొద్దిగా ఆమ్లంగా ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు.

67

కడుపు నొప్పి

తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్ల కంటె ఎక్కువ తేనెను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
 

77


మలబద్దకం

తేనెను మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి. తేనెను ఎక్కువగా తీసుకుంటే అందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట ఇబ్బంది పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories