ఎసిడిటీ రాకూడదంటే ఇలా చేయండి

Published : Aug 14, 2023, 07:15 AM IST

ఎసిడిటీ వల్ల తిన్న వెంటనే గుండెల్లో, కడుపులో మంటగా అనిపిస్తుంది. కొంతమందికైతే కడుపు నొప్పి కూడా రావొచ్చు. అయితే కొన్ని చిట్కాలు ఎసిడిటీ మొత్తమే రాకుండా చేస్తాయి. అవేంటంటే..  

PREV
15
ఎసిడిటీ రాకూడదంటే ఇలా చేయండి
acidity

ఎసిడిటీ అనేది నేడు చాలా మందిని వేధిస్తున్న సర్వ సాధారణ ఆరోగ్య సమస్య. ఆమ్లాలు ఎక్కువగా స్రవించినప్పుడు అసిడిటీ సమస్య వస్తుంది. స్రావం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గుండెల్లో మంట వస్తుంది. ఇది సాధారణం. సాధారణంగా ఈ సమస్య కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్లే వస్తుంది.

25
acidity

భోజనం చేసిన వెంటనే గుండెల్లో మంట,  ఉబ్బరంగా అనిపించడం ఎసిడిటీ లక్షణాలు. అయితే ఈ ఎసిడిటీ వల్ల కొంతమందికి కడుపు నొప్పి కూడా వస్తుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే అల్సర్లు వస్తాయి. ఆ తర్వాత ఇది ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఎసిడిటీ రాకుండా చూసుకోవాలి. ఎసిడిటీ రాకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

35

1. కెఫిన్ కంటెంట్ ఉన్న ఆహారాలను వీలైనంత దూరంగా ఉండాలి. లేదా చాలా వరకు తగ్గించాలి. 
2. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలి.
3. అరటిపండ్లు, పుచ్చకాయలు, దోసకాయలను మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి మీ  శరీరాన్ని  హైడ్రేట్ గా ఉంచుతాయి.
4. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలను తాగాలి. 

45

5. పోద్రపోవడానికి రెండు గంటల ముందే తినాలి. 
6. ఊరగాయలను క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి
7. పుదీనా ఆకుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. 
8. భోజనం తర్వాత లవంగాలను నోట్లో వేసుకుని నమలడం వల్ల ఎసిడిటీని నియంత్రించొచ్చు.
9. మితిమీరిన ధూమపానం, మద్యపానం వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

55
acidity

10. ఆహారాన్ని బాగా నమిలి తినడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువ ఆహారాన్ని తింటే అది జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే ఆమ్ల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. 
11. జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి అల్లం కూడా సహాయపడుతుంది. కాబట్టి అల్లంను ఆహారంలో చేర్చుకోండి. 
12. సోయాబీన్ వంటి గింజలు కొంతమందికి అసిడిటీని కలిగిస్తాయి. అందుకే ఎసిడిటీని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. 

Read more Photos on
click me!

Recommended Stories