బెండకాయల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

First Published Dec 24, 2021, 4:25 PM IST

బెండకాయలను బెండి, లేడీస్ ఫింగర్, ఓక్రా ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. బెండకాయలు జిగురు తత్వాన్ని కలిగి శరీరానికి  అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. బెండకాయలలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే వాటిని తినకుండా ఉండలేరు. ఇది హై ప్రోటీన్ వెజిటేబుల్. బెండకాయలు (Ladies finger) అనేక వ్యాధులను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బెండకాయలతో చట్నీ, మసాలా కూరలు, ఫ్రై ఇలా ఎన్నో రకాల వంటలు చేసుకుంటాము. ఇలా ఏదో ఒక రూపంలో బెండకాయలను శరీరానికి అందించడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా బెండకాయలు శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..       
 

బెండకాయలలో విటమిన్ ఏ, బి, సి, ఈ, కె, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు బెండకాయలలో ముసిలగినౌస్ ఫైబర్ (Musilginous fiber) అధికంగా ఉండి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఇప్పుడు మనం బెండకాయలు శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
 

డయాబెటిస్ ను నివారిస్తుంది: డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు బెండకాయలను డైట్ లో తీసుకోవడం మంచిది. బెండకాయలు డయాబెటిస్ కు విరుగుడుగా (Antidote) పనిచేస్తాయి.

బరువును తగ్గిస్తుంది: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు రెగ్యులర్ డైట్ (Regular diet) లో బెండకాయలను తీసుకోవడం మంచిది. బెండకాయలు బరువు తగ్గించడానికి (Weight 
loss) సహాయపడుతాయి.  

మలబద్దకం సమస్యలు తగ్గుతాయి: బెండకాయలలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను (Digestive system) మెరుగు పరచి పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడి మలవిసర్జన సమస్యల (Defecation problems) నుంచి విముక్తిని కలిగిస్తాయి.

గుండె సమస్యలను తగ్గిస్తుంది: బెండకాయలు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ (Cholesterol levels) ను కంట్రోల్ చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. బెండకాయలలో ఉండే న్యూట్రీషినల్ గుణాలు గుండె సమస్యలను (Heart problems) తగ్గించడానికి సహాయపడుతాయి.

చర్మసౌందర్యాన్ని పెంచుతాయి: బెండకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మసౌందర్యాన్ని (Skin beauty) పెంచుతాయి.
 

క్యాన్సర్ వ్యాప్తిని అరికడుతుంది: బెండకాయలలో అధిక మొత్తంలో విటమిన్లు (Vitamins), ఖనిజాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి అన్ని రకాల క్యాన్సర్ (Cancer) లను అడ్డుకుంటాయి.
 

గర్భిణీలకు చాలా మంచిది: గర్భంతో ఉన్న మహిళలు (Pregnant women) బెండకాయలను తింటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. బెండకాయలో ఉండే పోషకాలు పుట్టే పిల్లల్లో ఎముకలను స్ట్రాంగ్ (Strong bones) గా ఉంచడానికి సహాయపడతాయి.
 

జుట్టు సౌందర్యం పెరుగుతుంది: బెండకాయలు శరీర ఆరోగ్యంతో పాటు జుట్టు సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. నిత్యం ఏదో ఒక రూపంలో బెండకాయలను తింటే చుండ్రు (Dandruff), జుట్టు రాలడం (Hair fall) వంటి సమస్యలు తగ్గిపోతాయి.

click me!