నలుగురిలో అందంగా ఆకర్షణీయంగా కనబడాలనే కోరికలు అందరిలోనూ ఉంటాయి. కానీ వాతావరణ కాలుష్యం కారణంగా చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చర్మ సమస్యల (Skin problems) కారణంగా ముఖం నిర్జీవంగా కాంతిహీనంగా మారి సహజ సౌందర్యాన్ని కోల్పోతోంది. బయట దొరికే ఆర్టిఫిషియల్ క్రీమ్స్ వాడడంతో చర్మానికి పై పై నిగారింపు దొరుకుతుంది. కానీ చర్మ కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక చర్మ బాహ్య సౌందర్యాన్ని, లోపల సౌందర్యాన్ని మెరుగు పరచడానికి ఫ్రూట్ జ్యూస్ (Fruits juices) లు మంచివని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఫ్రూట్ జ్యూస్ లు చర్మ సౌందర్యానికి ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకుందాం..
ఫ్రూట్ జ్యూస్ లు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి మంచి బ్యూటీ ప్రొడక్ట్ (Beauty product) గా పనిచేస్తాయి. ఇవి వయసు పైబడటంతో వచ్చే వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని మృదువుగా మారుతాయి. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని (Dirty) బయటకు పంపించి చర్మ నిగారింపును పెంచుతాయి. అయితే చర్మ సౌందర్యం కోసం ఏ జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
27
అరటిపండు: అరటి పండులో (Banana) అధిక మొత్తంలో పొటాషియం (Potassium) ఉంటుంది. రోజు అరటి పండ్లు తీసుకుంటే పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని టైట్ గా మార్చి వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
37
బొప్పాయి: చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు బొప్పాయి (Papaya) మంచి బ్యూటీ ప్రొడక్ట్స్ గా సహాయపడుతుంది. నిర్జీవంగా మారిన చర్మానికి తిరిగి నిగారింపును అందిస్తుంది. రోజు బొప్పాయి జ్యూస్ తాగిన, ఒక కప్పు బొప్పాయి ముక్కలను తిన్న చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. బొప్పాయిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి (Vitamin C) చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
47
దానిమ్మ: దానిమ్మ (Pomegranate) గింజలలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మంలో పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తాయి. చర్మాన్ని శుభ్రపరిచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. రోజు దానిమ్మ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
57
అవొకాడో: అవొకాడో (Avocado) చర్మ సౌందర్యాన్ని పెంచే దివ్యౌషధంగా పనిచేస్తుంది. అవొకాడోను నిత్యం తీసుకుంటే చర్మానికి కావలసిన తేమ అంది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి అవొకాడోతో ఫేస్ ప్యాక్ లను ట్రై చేసినా మంచి ఫలితం ఉంటుంది.
67
నారింజ: నారింజ (Orange) జ్యూస్ తీసుకుంటే చర్మం ముడుతలు పడకుండా టైట్ గా ఉంచే కొలాజిన్ (Collagen) ను ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముఖంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించి చర్మ నిగారింపు పెంచుతుంది.
77
వీటితో పాటు జామకాయ, పుచ్చకాయ, స్ట్రాబెరీ, యాపిల్, పైనాపిల్ వంటి ఫ్రూట్ జ్యూస్ లను తీసుకుంటే శరీర ఆరోగ్యం (Body health) మెరుగుపడటంతో పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్య వయసులో కూడా చర్మ సౌందర్యం తాజాగా ఉంటుంది.