ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోతున్నారు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి ఏదైనా అడ్డుపడినప్పుడు గుండె ఆక్సిజన్ సరఫరా లో ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో గుండెపోటు సంభవిస్తూ ఉంటుంది.
అయితే చాలామందికి గుండెపోటు ఎక్కువగా ఏ రోజులలో వస్తుంది అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే ఇప్పటికే దీనిపై పరిశోధన ప్రారంభించారు పరిశోధకులు. అయితే వారి పరిశోధనలో గుండెపోటు ఎక్కువగా సోమవారం వస్తుందనే షాకింగ్ నిజం బయటపడింది.
అయితే వారానికి, గుండెపోటు కి మధ్య సంబంధం ఏమిటి అని ఆశ్చర్యపోవద్దు. దానికి గల కారణాలు వివరించారు వైద్యులు. నిజానికి వారు ఈ నిర్ధారణకి రావడానికి ముందు దాదాపు 7 ఏళ్ల కాలంలో ఒక లక్ష యాభై ఆరువేల ఆసుపత్రులలో నమోదైన హార్ట్ ఎటాక్ కేసులు వివరాలు సేకరించి, విశ్లేషించిన తరువాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.
అయితే సోమవారం నాడు మాత్రమే ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణాలను కూడా వివరించారు. శని, ఆదివారాలు సహజంగా వీకెండ్ అంటూ జనాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వీకెండ్స్ లో వారి జీవనశైలి భిన్నంగా ఉంటుంది. వారం లో మిగతా రోజుల జీవన విధానం వేరుగా ఉంటే, ఈ రెండు రోజుల జీవన విధానం వేరుగా ఉంటుంది.
అందువలన సోమవారం తిరిగి ఉదయం తొందరగా లేవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అప్పటికే శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురై ఉంటుంది. ఫలితంగా శరీరంలోని అంతర్గత వ్యవస్థ సర్కేడియన్ రిథమ్ దెబ్బతిని హార్ట్ ఎటాక్ సంభవించవచ్చని పరిశోధకులు తేల్చారు.
అయితే ఇలాంటి పరిస్థితే శీతాకాలంలోనూ అలాగే ఉదయం పూట మన శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తాయి. ఇది గుండెపోటుకి దారితీస్తుంది. కాబట్టి ఎంత వీకెండ్స్ అయినప్పటికీ కాస్తంత వ్యాయామం, ఒంటికి కాస్తంత చురుకుదనం అవసరం అంటున్నారు నిపుణులు.