మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే మీ రోజువారీ అలవాట్లలో ఒక చిన్న మార్పు చేసుకోవాలి. అదేంటంటే? ఎస్కలేటర్లు, ఎలివేటర్లకు బదులు మెట్ల వెంటన నడుచుకుంటూ వెళ్లండి. మెట్లను ఎక్కడం నా వల్ల కాదు అనే ముచ్చటను మర్చిపోండి. ఎందుకంటే మెట్లను ఎక్కడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మీరు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోకుండా, నడుము, కాళ్లలో నొప్పి లేకుండా ఉండేందుకు సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించండి. మరి మెట్లను ఎక్కడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.