క్యాన్సర్ ప్రపంచంలో చనిపోవటానికి రెండవ అతిపెద్ద కారణం. క్యాన్సర్ వచ్చే ముందు మగవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వాటిని ఏమాత్రం అశ్రద్ధ చేయటం మంచిది కాదు.సాధారణంగా మగవారి మూత్రవిసర్జన సమయంలో నొప్పి, అసౌకర్యం, అంగస్తంభనలో రక్తాన్ని అనుభవిస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. అందుకే ఇలాంటి విషయాలలో అస్సలు అశ్రద్ధ చేయకండి.
అలాగే దీర్ఘకాలిక నిరంతర దగ్గు అనేక విషయాలను సూచిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు బొంగురు పోవడం లేదా దగ్గినప్పుడు రక్తం పడటం, ఎలాంటి కారణమూ లేకుండా రెండుమూడు వారాలు అంతకంటే ఎక్కువ దగ్గు కొనసాగినట్లయితే ఇది అస్సలు నిర్లక్ష్యం చేయకూడని లక్షణం.
కచ్చితంగా మీరు వైద్యుడిని సంప్రదించవలసిన సమయం. అలాగే పురుషుల స్పర్మ్ పరిమాణము, ఆకృతిలో ఏమైనా మార్పులు ఉన్నాయేమో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. స్త్రీలు తమ రొమ్ములను ఎలా అయితే స్వీయ పరీక్ష చేసుకోవాలో అలాగే పురుషులు కూడా తమ వృషణాలను స్వయంగా పరీక్షించుకోవాలి.
వృషణాలు గడ్డలుగా కనిపించినా లేదంటే కొంచెం పెద్దవిగా కనిపించినా కూడా అసలు నిర్లక్ష్యం వహించకండి. ఇది వృషణ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. అలాగే మలంలో రక్తం పడటం, సుదీర్ఘమైన పొత్తికడుపు నొప్పి ఉంటే అది పెద్ద ప్రేగు క్యాన్సర్ కు సంకేతం కావచ్చు.
కాబట్టి ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా కూడా అశ్రద్ధ వహించకండి. అలాగే క్యాన్సర్ వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గొంతు నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్ని వారాలపాటు కొనసాగితే ఆహారాన్ని మింగడం కష్టమవుతుంది ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు.
కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే చర్మం పొలుసులు లేదా పుండ్లు లేదా మొటిమలు అలాగే పుట్టుమచ్చలు మొదలైనవి ఆకస్మాత్తుగా కనిపిస్తే అది చర్మ కాన్సర్ కి సంకేతం. కాబట్టి ఏ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.