సాధారణంగా మనం వంట కోసం రకరకాల నూనెలు వాడుతుంటాం. కానీ ఎక్కువమంది వాడేది మాత్రం రిఫైన్డ్ ఆయిల్స్. ఈ మధ్య ఈ నూనె వాడకం బాగా ఎక్కువైంది. అయితే ఈ నూనె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిస్తే ఇంకోసారి రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్లరు.
మనం ఇంట్లో ఏ వంట చేయాలన్న నూనె తప్పనిసరి. దాదాపు అన్ని వంటకాల్లో నూనె వాడుతుంటాం. నూనెలు శరీరానికి అవసరం. అవి శరీరానికి కావాల్సిన కొవ్వులను సరఫరా చేస్తాయి. అయితే కొన్ని నూనెలు వాడితే మాత్రం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదట. ఇంతకీ ఏ రకమైన నూనెలు ఆరోగ్యానికి హాని చేస్తాయో ఇప్పుడు చూద్దాం.
రిఫైన్డ్ ఆయిల్ వాడకం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమట. దీని వల్ల ఏటా లక్షలాది మంది చనిపోతున్నారట. కొచ్చిన్ ఆయుర్వేద పరిశోధనా విశ్వవిద్యాలయం ప్రకారం.. ఏటా 20 లక్షల మంది మరణాలకు రిఫైన్డ్ ఆయిల్ కారణం అవుతోంది.
24
రిఫైన్డ్ ఆయిల్ తో..
మామూలుగా అయితే నూనెలు మన శరీరానికి కావాల్సిన క్యాలరీలు, కొవ్వులు అందిస్తాయి. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ DNA, RNAలను దెబ్బతీస్తాయట. అంతేకాదు గుండెపోటు, బ్రెయిన్ డ్యామేజ్, పక్షవాతం, షుగర్, బీపీ, క్యాన్సర్, ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు, కిడ్నీ, లివర్ సమస్యలు, కొలెస్ట్రాల్, కంటి చూపు మందగించడం లాంటి సమస్యలకు దారితీస్తుందట.
34
రిఫైన్డ్ ఆయిల్ తయారీ
రిఫైన్డ్ ఆయిల్స్ అంటే శుద్ధి చేసిన నూనెలు అని అర్థం. ఈ పద్ధతిలో నూనె తయారు చేసేటప్పుడు విత్తనాల పై పొట్టుతో సహా నూనెను తీస్తారు. అనంతరం శుద్ధి చేసి, రుచి, వాసన, రంగు లేకుండా చేస్తారు. ఈ ప్రక్రియలో వాడే ప్రమాదకర ఆమ్లాలు ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు.
44
రిఫైన్డ్ ఆయిల్ దుష్ప్రభావాలు
రిఫైన్డ్ ఆయిల్ తయారయ్యేటప్పుడు టైర్ల తయారీలో వాడే రాగి లాంటి వ్యర్థాలు బయటకు వస్తాయి. దీని వల్ల నూనె విషపూరితం అవుతుంది. దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజూ ఈ నూనె వాడటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, అకాల మతిమరుపు, ఊబకాయం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.