Low BP: బీపి తక్కువైందా? అయితే వెంటనే ఇవి తినండి

Published : Feb 10, 2025, 01:56 PM IST

ప్రస్తుతం చాలామంది హైబీపి, లో బీపితో బాధ పడుతున్నారు. హైబీపి ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో.. లో బీపి కూడా అంతే. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా లో బీపి సమస్యను తగ్గించుకోవచ్చు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
Low BP: బీపి తక్కువైందా? అయితే వెంటనే ఇవి తినండి

ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా చాలామంది రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. వాటిలో హైబీపీ, లోబీపి ప్రధానమైనవి. మనం తరచూ హైబీపి గురించి వింటూనే ఉంటాం. హైబీపి ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది కాదో.. బీపి తక్కువ ఉండటం కూడా పెద్ద సమస్యే. సాధారణ బీపి 120/80 mmHg. అదే 90/80 mmHg కన్నా తక్కువైతే అది లో బీపిగా పరిగణిస్తారు. లో బీపి కూడా చాలా సమస్యలకు దారితీస్తుంది.

26
బీపీ తక్కువగా ఉంటే..

బీపి తక్కువగా ఉంటే తలతిరగడం, మైకం, చూపు మసకబారడం, వికారం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనత లాంటి సమస్యలు వస్తాయి. తక్కువ బిపి ఉన్నవారు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ బిపిని సులభంగా నియంత్రించవచ్చు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

36
బీట్ రూట్

బీట్రూట్‌లో ఉండే నైట్రేట్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్‌ను డైరెక్ట్ గా లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు.

ఉప్పు:

ఉప్పు ఎక్కువ తినడం అందరికీ మంచిది కాదు. కానీ తక్కువ బిపి ఉన్నవారు కాస్త ఎక్కువ ఉప్పు తీసుకోవచ్చు. ఉప్పు నీరు తాగడం వల్ల కూడా బిపి పెరుగుతుంది.

46
కాఫీ

కాఫీ తాత్కాలికంగా బీపిని పెంచుతుంది. తక్కువ బీపి ఉన్నవారు టీ, కాఫీ లేదా కూల్ డ్రింక్స్ తాగవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్‌లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బీపిని పెంచడంలో కూడా సహాయపడతాయి. తక్కువ బీపి ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది.

56
డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తక్కువ బీపి ఉన్నవారు ప్రతిరోజూ ఒక ముక్క డార్క్ చాక్లెట్ తినవచ్చు. దీని వల్ల బీపి పెరుగుతుంది.

గింజలు:

గింజలు, విత్తనాలలో ప్రోటీన్, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపిని నియంత్రిస్తాయి. బాదం, వాల్‌నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు  లాంటివి తినడం మంచిది.

66
అరటిపండు

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే బీపిని నియంత్రించవచ్చు.

గుడ్డు:

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఇనుము లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్కువ బీపి సమస్య నుంచి రక్షిస్తాయి. విటమిన్ బి12 రక్తహీనత, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories