ఈ ఒక్క నూనె పెడితే చాలు పాదాల్లో వాపు, పగుళ్లు మాయం!

Published : Feb 08, 2025, 04:33 PM IST

సాధారణంగా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు గాని, నిల్చున్నప్పుడు గాని ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే పాదాల వాస్తు ఉంటాయి. మరి పాదాల వాపును ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈజీగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

PREV
15
ఈ ఒక్క నూనె పెడితే చాలు పాదాల్లో వాపు, పగుళ్లు మాయం!

సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం, నిల్చోవడం, కీళ్ల నొప్పులు తదితర సమస్యలతో పాదాలు వాపు వస్తుంటాయి. పాదాల వాపు తగ్గడానికి చాలామంది రకరకాల నూనెలు ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాపు తగ్గడానికి వెల్లుల్లి నూనె బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. వాపు ఉన్న పాదాలకు వెల్లుల్లి నూనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

25
వెల్లుల్లి నూనె :

పాదాలవాపు తగ్గించడంలో వెల్లుల్లి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు వాపును తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతేకాదు వెల్లుల్లి నూనె చర్మానికి పోషణను అందిస్తుంది. పాదాలను మృదువుగా, ఆరోగ్యంగా చేస్తుంది.

35
ఔషధ గుణాలు:

వెల్లుల్లిలో అలెర్జీ నిరోధక, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

- వాపు ఉన్న పాదాలకు వెల్లుల్లి నూనెతో మసాజ్ చేస్తే కండరాలు సడలి, అలసట తగ్గుతుంది. ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఈ నూనెను ఉపయోగించవచ్చు.

-  వెల్లుల్లిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వర్షాకాలంలో మురికి కారణంగా పాదాలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లి నూనెను ఉపయోగించడం చాలా మంచిది. 

 

45
తయారీ విధానం

కావలసిన పదార్థాలు:

వెల్లుల్లి రెబ్బలు - 15
కొబ్బరి నూనె లేదా ఆవ నూనె - 1 కప్పు
పసుపు - 1 స్పూన్

తయారీ:

ఒక పాత్రలో నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి పసుపు కూడా కలపండి. వెల్లుల్లి రంగు బాగా మారిన తర్వాత, దాన్ని వడకట్టి చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక గాజు సీసాలో పోసి అవసరమైనప్పుడు ఉపయోగించండి.

55
ఎలా వాడాలి?

వాపు ఉన్న దగ్గర వెల్లుల్లి నూనెను బాగా రాయండి. తర్వాత చిన్నగా మసాజ్ చేయండి. 10-15 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత దానిపై ఒక క్లాత్ కప్పండి. పాదాలను కొంతసేపు పైకి లేపి ఉంచండి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. రోజుకు రెండుసార్లు ఈ నూనెను పెట్టుకోవచ్చు.

click me!

Recommended Stories