మీ మూత్రం దుర్వాసన వస్తోందా? దీన్ని తేలిగ్గా తీసుకున్నారో మీ పని అంతే..!

Published : Jul 14, 2023, 09:46 AM IST

మూత్రం దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ దీన్ని తేలిగ్గా తీసిపారేస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
19
మీ మూత్రం దుర్వాసన వస్తోందా? దీన్ని తేలిగ్గా తీసుకున్నారో మీ పని అంతే..!

మీ జీవనశైలి అలవాట్ల గురించి కూడా మీ మూత్రం చాలా చెబుతుందంటున్నారు నిపుణులు. మూత్రం రంగు నుంచి దాని స్మెల్ వరకు.. ప్రతిదీ మీ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అయితే మూత్రం దుర్వాసన వస్తే దాన్ని తేలిగ్గా తీసిపారేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రమాదకరమైన రోగాలు కూడా ఇందుకు కారణమవుతాయి. 
 

29
urine

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సాధారణంగా మన మూత్రానికి దాని స్వంత వాసన ఉంటుంది. కానీ మీరు బాగా హైడ్రేట్ అయితే అది అంత ఘాటుగా ఉండదు. ఒకవేళ మీరు డీహైడ్రేట్ద అయితే ప్రతి గంట గడిచేకొద్దీ ఈ వాసన ఇంకా చెడుగా మారుతుంది. కానీ ఇదంత హానికరమేమీ కాదు. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. అసలు మూత్రం దుర్వాసన ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

39

పోషక పదార్ధాలు

ప్రస్తుతం పోషకాలను ఎక్కువ మొత్తంలో తీసుకునేవారు చాలా మందే ఉన్నారు. విటమిన్లు ముఖ్యంగా బి విటమిన్లు వంటి సప్లిమెంట్స్ ను తీసుకుంటే కూడా మీ మూత్రం రంగు మారడంతో పాటుగా వాసన కూడా చెడుగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

49

urine-color

డయాబెటిస్

మీ మూత్రం దుర్వాసన రావడానికి డయాబెటీస్ కూడా ఒక కారణమే. మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే .. మీ చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మూత్రం వాసన వస్తుంది. మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు తీపి వాసనను వస్తుంది. ఇది డయాబెటిస్ ప్రారంభ సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

59

యూటీఐ 

మూత్రం దుర్వాసన లేదా కుళ్లిన గుడ్డు వంటి వాసన వస్తే మీకు యూటీఐ లేదా మూత్ర మార్గ సంక్రమణ ఉందని అర్థం. ఇది వీటి సంకేతాల్లో ఒకటి. మీకు అక్కడ బ్యాక్టీరియా లేదా ఫంగల్ పెరిగినప్పుడు అది మీ యోని బయోమ్ పై ప్రభావం చూపుతుంది. ఇది మూత్రం వాసనకు కారణమవుతుంది. 

69

ఎస్టీఐ

క్లామిడియా, గోనేరియా మూత్ర వ్యవస్థను ప్రభావితం చేసే లైంగిక సంక్రమణ వ్యాధులు. ఈ రెండూ మాత్రమే మూత్రం వాసనను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. లేకపోతే ఎస్టీఐలు ఆ ప్రభావాన్ని చూపవు.
 

79

ఎక్కువగా కాఫీ తాగుతారు

కాఫీని ఎక్కువగా తాగడం వల్ల మూత్రవిసర్జన తరచుగా చేస్తారు. దీనివల్ల మీరు డీహైడ్రేట్ అవుతారు. ఇది చివరికి మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు చేపల వాసన రావడానికి కారణమవుతుంది. అందుకే కాఫీని తాగడానికి ముందు, తర్వాత ఒక గ్లాసు నీటిని తాగడం అలవాటు చేసుకోండి. 

89

వెల్లుల్లిని ఎక్కువగా తినడం

బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన 2016 అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి లేదా ఆస్పరాగస్ వంటి ఘాటైన వాసన ఉన్న వాటిని తింటే చాలా మందికి వారి మూత్రం వాసన వస్తుంది. 

మీరు ప్రెగ్నెంట్ కావొచ్చు 

మీరు ప్రెగ్నెంట్ అయితే హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. అలాగే మీ మూత్రం వాసనను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు ప్రభావితం చేస్తాయి..హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల వీరి మూత్రం వాసన వస్తుంది. 
 

99

మూత్రపిండాల్లో రాళ్లు

మీ మూత్రాశయాన్ని ప్రభావితం చేసే ఏదైనా మూత్ర సమస్యలు కూడా మీ మూత్రం వాసనను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే కూడా మీ మూత్రం వాసన వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories