తక్కువ నిద్రపోతే ఎన్ని రోగాలొస్తయో తెలుసా?

Published : Jul 13, 2023, 03:50 PM IST

అలసిసొలసిన శరీరాన్ని తిరిగి శక్తివంతంగా మార్చడానికి, రోగాలను త్వరగా నయం చేయడానికంటూ నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది చాలా తక్కువ సేపు నిద్రపోతున్నారు. ఇదే ఎన్నో రోగాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
తక్కువ నిద్రపోతే ఎన్ని రోగాలొస్తయో తెలుసా?

ప్రస్తుత కాలంలో నిద్రలేమి  సర్వ సాధారణ సమస్యగా మారింది. ఎక్కువ మంది రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం, ఉదయం తొందరగా లేవకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయడం, సోషల్ మీడియాలో ఎక్కువ గంటలు పాల్గొనడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది అవసరమైన దానికంటే చాలా తక్కువ నిద్రపోతున్నారు. కానీ తగినంత నిద్ర లేకపోవడం వల్ల శారీరక సమస్యల నుంచి మానసిక సమస్యలు వస్తాయి. అసలు తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
 

25
weight loss

అభిజ్ఞా పనితీరు తగ్గడం

నిద్రలేమి వల్ల వచ్చే అత్యంత సాధారణ సమస్యల్లో అభిజ్ఞా పనితీరు తగ్గడం ఒకటి. మీరు తగినంత సమయం పడుకోకపోవడం వల్ల మీ మెదడు సమాచారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేదు. అలాగే సమాచారాన్ని నిల్వ కూడా చేయలేదు. ఇది ఏకాగ్రతలో ఇబ్బందిని కలిగిస్తుంది. జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఇది తర్వాత చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తుంది. 
 

35

మానసిక స్థితిలో మార్పు, చిరాకు

నిద్రలేమి మీ మానసిక స్థితి, భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర సరిపోకపోతే మీకు తరచుగా కోపం లేదా చిరాకుగా అనిపిస్తుంది. అంతేకాదు మీరు మరింత ఆత్రుతగా లేదా నిరాశకు గురవుతారు. అలాగే మీ భావోద్వేగాలను నియంత్రించడానికి ఇబ్బంది పడతారు. ముఖ్యంగా రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 

45

బలహీనమైన రోగనిరోధక శక్తి

కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల కూడా మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, మరమ్మత్తు చేయడానికి కొంత సమయం అవసరం. అయితే మీరు ఆ సమయాన్ని ఇవ్వకుంటే మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది.
 

55

బరువు పెరగడం

నిద్రలేమితో కూడా బరువు పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మీరు కంటినిండా నిద్రపోనప్పుడు మీ హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. ఇది ఆకలి, అనారోగ్యకరమైన ఆహారాల కోరికలను పెంచుతుంది. అలాగే మీరు అలసిపోయినప్పుడు చురుగ్గ ఉండరు. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories