మీ పాదాలను క్రమం తప్పకుండా చెక్ చేయండి
ఎర్రగా, వాపు, నొప్పి, గాయం లేదా బొబ్బలు వంటివి మీ పాదాలపై అయ్యే అవకాశం ఉంది. అందుకే మీ పాదాలను క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్టైతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఈ సీజన్ లో మీ పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే తేమ చర్మంపై బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. ప్రతిరోజూ మీ పాదాలను గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బుతో కడగండి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి, అవసరమైతే మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.