పిల్లలు పాలు తాగడం లేదా... అయితే ఈ సూపర్ ఫుడ్స్ ఖచ్చితంగా పెట్టండి!

Navya G   | Asianet News
Published : Dec 30, 2021, 04:38 PM IST

చాలామంది పిల్లలు పాలు (Milk) తాగడానికి పెద్దగా ఇష్టపడరు. ఈ విషయంలో చాలా మంది తల్లులు నిరాశ చెందుతున్నారు. పాలు తాగకపోతే వారికి కావల్సిన క్యాల్షియం (Calcium) అందక వారి ఎదుగుదలలో లోపం ఏర్పడుతుందని వారిలో దిగులు ఏర్పడుతోంది. అయితే డాక్టర్ల సలహా మేరకు పాలు తాగని పిల్లలకు అందించవలసిన సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
పిల్లలు పాలు తాగడం లేదా... అయితే ఈ సూపర్ ఫుడ్స్ ఖచ్చితంగా పెట్టండి!

పాలలో సమృద్ధిగా క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం పిల్లల ఎదుగుదలకు ప్రధాన పాత్ర వహిస్తుంది. మరి పాలే తాగని పిల్లల ఎదుగుదలకు క్యాల్షియం ఎక్కడి నుంచి లభిస్తుంది.. అని చాలా మంది తల్లులు ఆలోచిస్తున్నారు. అయితే పాలు తాగని పిల్లలకు ప్రత్యామ్నాయంగా (Substitute) కొన్ని పదార్థాలను ఆహారంలో అందిస్తే వారి ఎదుగుదలకు కావాల్సిన క్యాల్షియం అంది వారిలో ఇమ్యూనిటీ (Immunity) పెరిగేలా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం పిల్లలకు అందించవలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం..
 

28

నట్స్: నట్స్ (Nuts) లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి పిల్లల ఎదుగుదలకు మంచి హెల్తి ఫుడ్ (Healthy Food). డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటిని పిల్లలకు ఏదో ఒక రూపంలో అందించాలి.
 

38

గుడ్డు, సీ ఫుడ్స్: పిల్లల ఎదుగుదలకు మానసిక వికాసానికి క్యాల్షియంతోపాటు విటమిన్ డి కూడా ముఖ్యమే. కనుక రోజూ కొద్దిసేపు వారికి ఎండ తగిలేలా చూడాలి. వీటితోపాటు విటమిన్ డి అధికంగా ఉండే సీ ఫుడ్స్ (Sea Foods), గుడ్డు (Egg) వంటి ఆహార పదార్థాలను తరచుగా పిల్లలకు ఇస్తే మంచిది. 
 

48

ఆకుకూరలు: చిన్నారుల ఎదుగుదలకు కావలసిన క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఖనిజలవణాలు (Minerals) ఆకుకూరల్లో (Leafy greens) పుష్కలంగా ఉంటాయి. కనుక పిల్లలకు అందించే ఆహార పదార్థాలలో ఆకుకూరలు చేరిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది.   
 

58

పప్పులు: పప్పులలో (Pulses) అధిక మొత్తంలో పీచు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పిల్లలకు అందిస్తే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వారు శారీరకంగా దృఢంగా (Physically fit) ఉంటారు. కనుక పిల్లలకు అందించే ఆహార పదార్థాలలో పప్పులు తప్పనిసరి.
 

68

సోయాబీన్: సోయాబీన్ (Soybean) లో క్యాల్షియం, పొటాషియం (Potassium) అధికంగా ఉంటాయి. వీటిని పిల్లలకు అందిస్తే వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. సోయాబీన్ పిల్లల ఎదుగుదలకు ఒక హెల్తీ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు.
 

78

పండ్లు: పండ్లలో (Fruits) క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. వీటిని నేరుగా అయినా ఇవ్వవచ్చు, జ్యూస్ ల రూపంలో అయినా పిల్లలకు అందించవచ్చు.
 

88

ఓట్స్: ఓట్స్ (Oats) లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ పిల్లలకు ఇస్తే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు పెరుగుదల (Growth) కూడా బాగుంటుంది.

click me!

Recommended Stories