నలభైఏళ్ల వయసులోను హుషారుగా ఉండాలంటే ఈ ఆరోగ్యమైన ఆహారం తినండి.. యవ్వనంగా ఉండండి!

Navya G   | Asianet News
Published : Dec 30, 2021, 04:01 PM IST

 వివాహం తరువాత కొత్త బాధ్యతలు చేపట్టడంతో మహిళలు అధిక ఒత్తిడికి లోనవుతున్నారు. అటు పిల్లల బాధ్యత, ఇటు ఉద్యోగం పరంగా పని ఒత్తిడి పెరగడంతో వారు చాలా ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటి కారణంగా అలసట చెంది ఫలితంగా చలాకీతనం (Agility) తగ్గుతోంది. కొన్నిసార్లు డిప్రెషన్ (Depression) బారిన పడుతున్నారు. అయితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వారు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
17
నలభైఏళ్ల వయసులోను హుషారుగా ఉండాలంటే ఈ ఆరోగ్యమైన ఆహారం తినండి.. యవ్వనంగా ఉండండి!

ఇల్లాలికి నలభై వచ్చేసరికి వారి జీవితంలో కొత్త బాధ్యతలు (Responsibilities) పెరగడంతో వారు అన్నింటిని సమర్థవంతంగా చూసుకుంటూ అధిక ఒత్తిడికి (Stress) లోనవుతున్నారు. అయితే వారు నలభైలోనూ హుషారుగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను వారి  జీవనశైలిలో చేర్చుకుంటే పని ఒత్తిడి భారం తగ్గి హుషారుగా ఉంటారు. ఆరోగ్య నిపుణుల సలహా మేరకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..
 

27

క్యారెట్: క్యారెట్ లో విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ డిప్రెసెంట్ (Anti-depressant) గా పనిచేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు ముఖ్యంగా కళ్ళ సమస్యలను అరికడతాయి. కనుక ఆహార జీవనశైలిలో క్యారెట్ (Carrot) ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది పని ఒత్తిడి కారణంగా ఏర్పడే అలసటను, ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచి చలాకి తనాన్ని పెంచుతుంది.
 

37

నెయ్యి: చాలామంది నెయ్యి (Ghee) తింటే అధిక బరువు పెరుగుతారని అనుకుంటారు. ఇది కేవలం వారి అపోహ మాత్రమే. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ (Healthy Cholesterol) శాతం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తక్కువ పరిమాణంలో తప్పక తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నెయ్యి డిప్రెషన్ బారిన పడకుండా చూస్తుంది.
 

47

తాజా పండ్లు: తాజా పండ్లలో (Fresh fruits) విటమిన్లు, మినరల్స్ పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక సీజన్ లో దొరికే పండ్లను తీసుకుంటే డిప్రెషన్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్లు వంటి పదార్థాలకు దూరంగా ఉంటూ తాజా పండ్లను తీసుకుంటే మానసిక ఒత్తిడి (Mental stress) తగ్గుతుంది.
 

57

ఆకుకూరలు: రోజూ తీసుకునే ఆహారంలో తోటకూర, గోంగూర, బచ్చలి వంటి తాజా ఆకుకూరలను (Leafy greens) తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు  (Nutrients) పుష్కలంగా లభిస్తాయి. దీంతో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి.
 

67

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) లో పోషకాలు, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు  పుష్కలంగా ఉంటాయి. కనుక బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు వంటి ఇతర గింజల్ని రోజు తీసుకుంటే నలభైలోనూ హుషారుగా (Wisely) ఉంటారు.
 

77

వీటిని తీసుకుంటూ సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కంటూ ప్రత్యేక శ్రద్ధ (Attention) తీసుకోవాలి. అప్పుడే మీరు డిప్రెషన్ బారినపడకుండా ఆరోగ్యంగా (Healthy) ఉంటారు.

 

click me!

Recommended Stories