అవిసె గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 30, 2021, 01:38 PM IST

అవిసె గింజలలో (Flax seeds) ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలగజేస్తాయి. వీటిని మన ఆహార జీవనశైలిలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. అవిసె గింజల లాటిన్ పేరు లినమ్ యుసిటటిసిమం (Linum eucalyptus), అంటే చాలా ఉపయోగకరం అని అర్థం. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఎన్నో   పోషకాలను కలిగిన అవిసె గింజలను ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా అవిసె గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..  

PREV
18
అవిసె గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?
flax seeds

అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్, మ్యుసిలేజ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ బి1, ప్రొటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, సెలీనియంలు వంటి పౌష్టిక విలువలు (Nutritional values) ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. అవిసెగింజలతో ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..

28
flax seeds

బరువు తగ్గిస్తాయి: బరువు తగ్గాలనుకొనే వారు డైట్ లో అవిసె గింజలను తీసుకోవటం మంచిది. అవిసె గింజలలో ఉండే పీచు పదార్థం (Fiber) కారణంగా కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి అవ్వదు. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మది పరుస్తుంది. దీంతో ఎక్కువసార్లు తినాలనే కోరిక కలగదు. దీంతో శరీర బరువు తగ్గుతుంది (weight loss).

38

గుండె సమస్యలను తగ్గిస్తుంది: అవిసె గింజలలోని యాంటి-ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరిచి గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. గుండె సమస్యలను (Heart problems) తగ్గిస్తాయి.

48

మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి: రక్తంలో గ్లూకోజ్ (Glucose) కలవడాన్ని తగ్గిస్తాయి. కనుక మన ఆహారనియమాలలో అవిసె గింజలను ఒక భాగంగా మార్చుకోవాలి. వీటిని తీసుకుంటే మధుమేహాన్ని (Diabetes) అదుపులో ఉంచుకోవచ్చు.

58

ఆర్థరైటిస్ ను తగ్గిస్తాయి: అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు వాపులు, ఆర్థరైటిస్ (Arthritis) లను తగ్గించడానికి మంచి ఔషధంగా (Medicine) సహాయపడతాయి.

68

మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి: అవిసె గింజలలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను (Digestive system) మెరుగు పరిచి పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడతాయి. దీంతో మలబద్దకం (Constipation) సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
 

78

క్యాన్సర్ వ్యాప్తిని అరికడతాయి: అవిసె గింజలలో ఉండే పోషకాలు (Nutrients) శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ లకు దూరంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ ఇలా కొన్ని రకాల క్యాన్సర్ (Cancer) ల వ్యాప్తిని అరికట్టే సామర్థ్యం అవిసె గింజలకు ఉంటుంది.
 

88

జలుబు, దగ్గును తగ్గిస్తాయి: ఒక గిన్నెలో మూడు స్పూన్ ల అవిసె గింజలను ఒక కప్పు నీరు పోసి బాగా ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న అవిసె గింజలను వడగట్టి నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో మూడు స్పూన్ ల నిమ్మరసం, మూడు స్పూన్ ల తేనే కలిపి త్రాగాలి. ఇలా చేస్తే జలుబు (Cold), దగ్గు (Cough) వంటి దీర్ఘకాలిక సమస్యలు తగ్గిపోతాయి.

click me!

Recommended Stories