మనం ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తున్నామంటే దానికి కారణం కళ్లు. కంటి చూపు బాగుంటేనే మనం ఏ పనినైనా ఈజీగా చేయగలం. అయితే మనం చేసే కొన్ని తప్పులు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మరి కళ్లు బాగుండాలంటే ఏ పనులు చేయకూడదో ఇక్కడ చూద్దాం.
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ముందు వరుసలో ఉంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. కానీ చాలామంది కంటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. మనం చేసే చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. కంటి చూపు బాగుండాలంటే.. కొన్ని అలవాట్లను కచ్చితంగా మానేయాలని సూచిస్తున్నారు. అవేంటో, వాటివల్ల కళ్లు ఎలా దెబ్బతింటాయో ఇక్కడ తెలుసుకుందాం.
26
సెల్‌ఫోన్, కంప్యూటర్ వాడకం:
ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్, కంప్యూటర్ వాడకం బాగా పెరిగిపోయింది. కానీ ఎక్కువసేపు వాటిని చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. తలనొప్పి, చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం, ఒత్తిడి వంటివి కలుగుతాయి. ఈ పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను పాడుచేస్తుంది. దీన్ని నివారించడానికి 20-20-20 నియమం పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడాలి. దీనివల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
36
సన్ గ్లాసెస్ లేకుండా బయటకు వెళ్లడం:
సూర్యుడి నుంచి వచ్చే అతినీలాలోహిత కిరణాలు చర్మాన్నే కాదు.. కళ్లను కూడా దెబ్బతీస్తాయి. ఇది కంటి శుక్లాలు, కంటి క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఒక్కోసారి కంటిచూపు కూడా కోల్పేయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా సన్ గ్లాసెస్ ధరించండి.
ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే కళ్లు పొడిబారి దురద పెడతాయి. దీంతో తెలియకుండానే కళ్లు నలుపుతాం. ఇలా చేయడం కళ్లకు హానికరం. కళ్లు ఎక్కువగా నలపడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. చేతులపై ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు కూడా కళ్లకు హానిచేసే అవకాశం ఉంది.
56
నిద్రలేమి:
సరిగ్గా నిద్రపోకపోతే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం, వెలుతురు చూడలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇది తీవ్రమైన కంటి వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.
66
కంటి పరీక్ష:
మనలో చాలామంది రెగ్యులర్ కంటి పరీక్షలు చేయించుకోరు. సమస్య వచ్చిన తర్వాతే డాక్టర్ దగ్గరకు వెళ్తుంటారు. కానీ మీ కంటి ఆరోగ్యం బాగుండాలంటే.. ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవాలి. దానివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.