గుడ్లను ఇష్టపడని వారు చాలా మందే ఉంటారు. గుడ్లను రకరకాల వండుకుని రోజూ తింటుంటారు కొందురు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరు. ఒక గుడ్డులో సుమారుగా 7 గ్రాముల అధిక-నాణ్యతకలిగిన ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వుతో పాటుగా ఖనిజాలు, విటమిన్లు, ఇనుము వంటి ఎన్నో రకాల సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మన శరీరంలో పోషకాల లోపమనేదే ఉండదు.