Image: Freepik
రోజుకో ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తుంటారు ఆరోగ్య నిపుణులు. అవును మరి ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. ఆపిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పండు. దీనిలో ఉండే పెక్టిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకో ఆపిల్ పండును తినడం వల్ల ఎలాంటి రోగాల ముప్పు తప్పుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
జీర్ణక్రియ
ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్థి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆపిల్స్ ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోజుకో ఆపిల్ పండును తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. దీంతో జీవక్రియలు మెరుగుపడతాయి.
Image: Getty Images
అధిక కొలెస్ట్రాల్
అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ తో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. అయితే ఆపిల్ ను తింటే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు తగ్గుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది.
Image: Getty Images
మధుమేహులు
ఫైబర్ పుష్కలంగా ఉండే యాపిల్స్ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే మధుమేహులు ఆపిల్స్ ను ధైర్యంగా తినొచ్చు. ఆపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
Image: Getty Images
ఇమ్యూనిటీ పవర్
ఆపిల్స్ కూడా విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజుకు ఒక ఆపిల్ పండును తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎముకల ఆరోగ్యం
యాపిల్స్ పండ్లను తినడం వల్ల మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ యాపిల్స్ తినడం వల్ల మీ ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.
విటమిన్ ఎ
ప్రతిరోజూ ఒక ఆపిల్ పండును తినడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వెయిట్ లాస్
ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే ఆపిల్ పండును తినడం వల్ల మీ ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గొచ్చు.
ఊపిరితిత్తుల ఆరోగ్యం
ఆపిల్ పండును తింటే డీహైడ్రేషన్ వచ్చే సమస్య తగ్గుతుంది. అలాగే ఈ పండ్లు మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
చర్మ ఆరోగ్యం
ఆపిల్ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండు వృద్ధాప్య లక్షణాలను కూడా కొంతవరకు నిరోధిస్తుంది.