అల్లాన్ని ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త

First Published | Sep 11, 2023, 4:37 PM IST

అల్లంలో ఒకటేంటీ.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలా మంది అల్లాన్నిరెగ్యులర్ గా తీసుకుంటాయి. అయినప్పటికీ దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

Image: Getty Images

అల్లాన్ని ప్రతి వంటలో ఉపయోగిస్తుంటారు. నిజానికి అల్లంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంతో దగ్గు, జలుబు, వాపు, గొంతునొప్పి వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే అల్లాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు చాలా మంది. అల్లం వంటలను చాలా టేస్టీగా చేస్తుంది కూడా. అల్లం వికారం, వాంతులు, మంట, పీరియడ్స్ నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయినా అల్లం కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. దీన్ని మోతాదుకు మించి తీసుకున్నప్పుడే. అల్లాన్ని అతిగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Getty Images

జీర్ణశయాంతర సమస్య

అల్లం మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణులు ప్రకారం.. ఇది కొంతమందికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లాన్ని ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా ఖాళీ కడుపుతో దీన్ని తింటే జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. దీనివల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు కలత, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. 
 

Latest Videos


రక్తం సన్నబడటం 

అల్లంలో రక్తం సన్నబడే లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రక్త సరఫరా, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటికే రక్తం సన్నబడటానికి మందులను తీసుకుంటున్న లేదా రక్తస్రావం సమస్యలున్న వారు అల్లాన్ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
 

రక్తంలో తక్కువ చక్కెర

అల్లం మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ అల్లాన్ని డయాబెటిస్ మందులతో పాటుగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువగా తగ్గిస్తుంది. దీంతో మీకు హైపోగ్లైసీమియా సమస్య రావొచ్చు. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే, అలాగే అల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్టైతే మీ రక్తంలో చక్కెర స్థాయిలను రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. 

మందులతో పరస్పర చర్య

అల్లం అధిక రక్తపోటు, డయాబెటిస్ తో సహా కొన్ని మందులతో సంకర్షణ చెందుతుంది. అంటే అల్లం మీ మందుల ప్రభావాలను పెంచడమో లేదా తగ్గించడమో చేస్తుంది. ఇదెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే మీరు మందులను వాడుతున్నట్టైతే  అల్లాన్ని వాడాలో లేదో డాక్టర్ ను అడిగి తెలుసుకోండి. 
 

చర్మపు చికాకు

అల్లం కూడా కొంతమందికి చర్మపు చికాకు లేదా అలెర్జీని కలిగిస్తుంది. అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు లేదా పచ్చిగా తీసుకున్నప్పుడు ఇది సర్వసాధారణం. దీనివల్ల చర్మం ఎర్రగా మారడం, దురద లేదా దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. 

click me!