శరీరంలో పొటాషియం లోపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

First Published Aug 17, 2022, 3:15 PM IST

శరీరంలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక లవణాలు ఉంటాయి.
 

ఇందులో ముఖ్యంగా పొటాషియం అనే లవణం శరీరంలో నరాల పనితీరుకు, కండరాల కదలికకు సహాయపడుతుంది. శరీరానికి పొటాషియం లోపం (Potassium deficiency) ఏర్పడితే అనేక అనారోగ్య సమస్యలు (Health problems) తలెత్తుతాయి. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

శరీరంలో పొటాషియం ఉండవలసిన శాతం కంటే  తక్కువగా ఉంటే పొటాషియం లోపానికి దారితీస్తుంది. దీంతో హైపో కెలామిక్ పెరాలసిస్ (Hypokalemic paralysis) సమస్య వస్తుంది. పొటాషియం లోపాన్ని సిరం ఎలక్ట్రోలైట్స్    పరీక్షతో గుర్తించవచ్చు. అధికంగా విరేచనాలు, వాంతులు (Diarrhea, vomiting) అవుతున్నప్పుడు పొటాషియం లవణం ఎక్కువగా ఖర్చవుతుంది.
 

అలాగే వేసవిలో చెమట (Sweat) రూపంలో కూడా పొటాషియం ఎక్కువగా వృధా అవుతుంది. దీంతో పొటాషియం లోపం ఏర్పడుతుంది. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు (Kidney related problems) కూడా పొటాషియానికి మరో ముఖ్య కారణం. అంతేకాకుండా నిత్యం వాడే కొన్ని రకాల మందులు, సరైన ఆహార జీవనశైలి లేకపోవడం కూడా ఈ సమస్యకు దారితీస్తుంది.
 

శరీరంలో ఈ లోపం తలెత్తినప్పుడు కాళ్లు, చేతులు బలహీనపడి నడవడానికి, పనిచేయడానికి కష్టమవుతుంది. ఈ సమస్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కాళ్లు, చేతులు పూర్తిగా సచ్చుపడి నడవలేరు, కదలలేరు. అలాగే ఛాతి కండరాలు (Chest muscles) కూడా సచ్చుబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (Difficulty breathing) కలుగుతుంది.
 

అంతేకాకుండా ఈ సమస్య గుండెపై ప్రభావితం చూపి గుండె జబ్బులకు (Heart diseases) దారితీస్తుంది. అలాగే అధిక రక్తపోటు, మెదడు పనితీరు మందగించడం, ఒత్తిడి, ఆందోళన సమస్యలు కలుగుతాయి. ఇలా శరీరంలోని ఒక్క అవయవంపై ప్రభావితమై వాటి పనితీరు దెబ్బతింటాయి. దీంతో శరీర జీవక్రియ (Metabolism) పనితీరు తగ్గుతుంది. 
 

కనుక శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్ లతో పాటు పొటాషియం కూడా చాలా అవసరం. ఇందుకోసం తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడే పొటాషియం లోపం తగ్గి నరాల పనితీరు, కండరాల కదలిక బాగుంటుంది. ఇందుకోసం కొబ్బరి నీళ్లు (Coconut water),  పండ్లు (Fruits) ఎక్కువగా తీసుకోవాలి.
 

సీతాఫలం, దానిమ్మ, లీచి, స్ట్రాబెరీ, మామిడి, అరటిపండు, అవకాడో వంటి పండ్లలో  పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్లు (Vitamins) ఇతర పోషకాలు (Nutrients) పొటాషియం లోపాన్ని తగ్గించడంతోపాటు హైబీపీ సమస్యలను కూడా తగ్గిస్తాయి. వీటితోపాటు తాజా ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలలో పొటాషియం అధికంగా ఉంటుంది. 
 

చిలకడదుంప, బంగాళదుంప, పుట్టగొడుగులు బీన్స్ వంటి వాటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే పొటాషియం లోపాన్ని తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ (Diabetes), కిడ్నీ సమస్య, గుండె సమస్యలతో బాధపడేవారు పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక పొటాషియం తగిన మోతాదులో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహిస్తూ.. పొటాషియం లోపాన్ని తగ్గించుకోండి.. ఆరోగ్యంగా ఉండండి (Stay healthy)..

click me!