అలాగే మానసికంగా ఒత్తిడి, అలసట, నీరసం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో మానసిక ప్రశాంతత తగ్గుతుంది (Calm down). అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలు ఏర్పడతాయి. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లోపంగా గుర్తించాలి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు సరైన జీవనశైలిని అనుసరిస్తూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం తీసుకునే ఆహారంలో పండ్ల జ్యూసులు, మొలకలు, ఆకుకూరలు, సోయా చిక్కుడు గింజలను తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి త్వరగా పెరుగుతుంది.