ప్రస్తుత కాలంలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణాలెన్నో ఉన్నాయి. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతున్నాయి. కొవ్వు ఎక్కువున్న ఆహారాలు, నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలను ఎక్కువగా తినడం, వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం, మందును ఎక్కువగా తాగడం వంటివన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర మాంసం, కొవ్వు, స్వీట్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను నివారించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఉదయం కొన్ని డ్రింక్స్ ను తాగినా.. కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అవేంటంటే..