వెయిట్ లాస్
కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి నీరు చక్కెర పానీయాలకు సంతృప్తికరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అలాగే ఆహార కోరికలను కూడా తగ్గిస్తుంది.
మూత్రపిండాల పనితీరు
కొబ్బరి నీరు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. మూత్ర ఉత్పత్తిని ప్రోత్సహించి, మూత్రపిండాల పనితీరుకు మద్దతునిస్తాయి. అలాగే శరీరంలోని విషం బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.