యాలకులను తింటే బరువు తగ్గుతరా?

Published : Aug 17, 2023, 02:00 PM IST

యాలకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించి బరువు తగ్గడంతో పాటుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి.   

PREV
17
యాలకులను తింటే బరువు తగ్గుతరా?

యాలకులు సుగంధ ద్రవ్యాల రాణిగా ప్రసిద్ధి చెందాయి. యాలకుల్లో విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియంతో పాటుగా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. యాలకులను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు దీన్ని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27

బెల్లీ ఫ్యాట్

యాలకులు మన జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది శరీరం ఎక్కువగా ఉన్న కొవ్వును తొలగించడానికి, అలాగే కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయి. ఇవి ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు, బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకునే యాలకులను రోజువారి డైట్ లో చేర్చుకోవచ్చు. 
 

37
Image: Getty Images

జీర్ణక్రియ ఆరోగ్యం

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి. యాలకుల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనమేంటంటే? ఇది జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అలాగే 'గ్యాస్ ట్రబుల్' వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బినప్పుడు యాలకులను తింటే సమస్య తగ్గిపోతుంది. 
 

47

డయాబెటీస్

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇవి గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశాలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా యాలకులు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.

57

అధిక రక్తపోటు

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే యాలకులు కూడా అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. కాబట్టి యాలకులను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవచ్చు.
 

 

67

ఇమ్యూనిటీ

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే యాలకులు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో సహాయపడతాయి. అంతేకాదు దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను తగ్గించడానికి  కూడా యాలకులు ఎంతో సహాయపడతాయి. గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి యాలకుల పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.
 

77
cardamom

నోటి దుర్వాసన

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న యాలకులు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. కాబట్టి భోజనం తర్వాత యాలకులను నమిలితే నోటిలో దుర్వాసన రాదు. శ్వాస తాజాగా ఉంటుంది. 

click me!

Recommended Stories