Mineral Water vs Bore Water: మినరల్ వాటర్ మంచిదా? బోర్ వాటర్ మంచిదా? ఏ నీళ్లు తాగాలి?

Published : Oct 05, 2025, 01:42 PM ISTUpdated : Oct 05, 2025, 01:45 PM IST

ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. నీళ్లు సరిగ్గా తాగకపోతే తలనొప్పి నుంచి కిడ్నీల వరకు చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి సరిపడా నీళ్లు తాగాలి. కానీ ఏ నీళ్లు తాగాలి? బోర్ వాటర్? లేక మినరల్ వాటర్? రెండింట్లో ఏది మంచిదో ఇక్కడ చూద్దాం.

PREV
15
Mineral Water vs Bore Water

మనం ప్రతిరోజూ సరైన మోతాదులో నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటాం. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు కచ్చితంగా తాగాలని వైద్యులు చెబుతుంటారు. నిజానికి నీళ్లు తాగడం వల్ల చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ ఏ నీళ్లు తాగాలి? బోర్ వాటర్? లేక మినరల్ వాటర్? ఏ నీరు తాగడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అసలు ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

25
మినరల్ వాటర్

మినరల్ వాటర్ మంచిదా? లేక బోర్ వాటర్ మంచిదా.. అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఈ రెండు రకాల నీళ్ల మధ్య స్పష్టమైన తేడాలు చాలా ఉన్నాయి. మినరల్ వాటర్ అనేది శుద్ధి చేసిన లేదా సహజంగా ఖనిజాలు కలిగిన నీరు. దీన్ని ప్రత్యేకంగా శుద్ధి చేసి బాటిల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన మేరకు ఉంటాయి. అయితే దీన్ని కొంత మొత్తం పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో లభిస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ వల్ల పర్యావరణంపై చెడు ప్రభావం పడే ప్రమాదం కూడా ఉంది.

35
బోర్ వాటర్

భూగర్భ జలాల నుంచి మోటార్ ద్వారా వెలికితీసే నీరే బోర్ వాటర్. ఈ వాటర్ సహజంగా మట్టిలో ఉన్న ఖనిజాలను కలిగి ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు  ప్రధాన తాగునీటి వనరు బోరే. మన ప్లేస్ లో భూగర్భ జలాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఒక్కసారి బోర్ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది లాభమే అయినప్పటికీ.. నీటి శుద్ధత మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్, ఇతర రసాయనాల మోతాదు అధికంగా ఉండటంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

45
నివేదికల ప్రకారం..

WHO, ICMR నివేదికల ప్రకారం మినరల్ వాటర్‌లో ఖనిజాల మోతాదు నియంత్రితంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ కొన్ని బ్రాండ్లలో నైట్రేట్ అధికంగా ఉన్నట్లు CSE వంటి చాలా సంస్థల అధ్యయనాల్లో బయటపడింది. బోర్ వాటర్‌లోని అధిక ఫ్లోరైడ్ కారణంగా పలు గ్రామాల్లో ప్రజలు ఫ్లోరోసిస్ అనే సమస్యతో బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

55
శుద్ధతకు ప్రాధాన్యం..

నీటి నాణ్యత, దాని మూలం, శుద్ధి విధానం వంటి అంశాలను తీసుకున్నపుడు, మినరల్ వాటర్, బోర్ వాటర్ రెండింటినీ సమీక్షించి.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మినరల్ వాటర్ ఖరీదు ఎక్కువైనా శుద్ధత ఎక్కువగా ఉంటుంది. బోర్ వాటర్ ఖరీదు తక్కువైనా.. శుద్ధి పద్ధతులు సరిగ్గా లేకపోతే ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ నీరు తాగాలో తెలుసుకోవడం, అవసరమైన పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. 

Read more Photos on
click me!

Recommended Stories