Migraine: మైగ్రేన్ నొప్పికి ఇంటి చిట్కాలతోనే చెక్ చెప్పండి

Published : Apr 30, 2025, 01:21 PM IST

Migraine Relief: మీరు గాని, మీ ఇంట్లో గాని మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారా? ఈ సమస్య నుండి తక్షణం రిలీఫ్ పొందడానికి ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. త్వరగా రికవరీ అవుతారు. అవేంటో తెలుసుకుందామా?

PREV
15
Migraine: మైగ్రేన్ నొప్పికి ఇంటి చిట్కాలతోనే చెక్ చెప్పండి

ఈ రోజుల్లో చాలా మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. తల ఒక వైపు నొప్పి వస్తుంది. ఒక కంటి చూపు అస్పష్టంగా ఉంటుంది. వికారం, వాంతులు కూడా అయ్యే అవకాశాలుంటాయి. ఒక్కోసారి ఈ నొప్పి గంటల నుండి రోజుల వరకు ఉండవచ్చు. హార్మోన్ల సమస్యల కారణంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

25

శరీరంలో నీరు తక్కువగా ఉంటే.. 

శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే మైగ్రేన్‌ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే శరీరంలో తగినంత నీరు ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం ఎనిమిది నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అలాగే కెఫిన్ తీసుకోవడం పూర్తిగా మానేయడం కూడా మైగ్రేన్ తలనొప్పిని పెంచుతుంది.

35

8-9 గంటలు నిద్ర

మైగ్రేన్ తరచుగా చిన్న చిన్న విషయాల వల్ల వస్తుంది. అందుకే 8 నుంచి 9 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిపోకపోయినా మైగ్రేన్ నొప్పి వస్తుంది. రాత్రి కనీసం ఏడు నుండి తొమ్మిది గంటలు ప్రశాంతంగా పడుకోవడానికి ప్రయత్నించండి. మెడిటేషన్, యోగాసనాల ద్వారా చక్కటి నిద్ర వచ్చే విధంగా చేయవచ్చు. మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గించవచ్చు. 

45

జంక్ ఫుడ్ తినడం మానేయండి

కొన్ని ఆహార పదార్థాలు కూడా మైగ్రేన్‌కు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, జున్ను, చాక్లెట్, కెఫిన్, ఆల్కహాల్ చాలా మందిలో మైగ్రేన్ సమస్యను పెంచుతాయి. కాబట్టి వీటిని అప్పుడప్పుడు మాత్రమే తినడం మంచిది. ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిది.

తక్కువ ఉప్పు వాడండి

ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి వీలైనంత తక్కువ ఉప్పు తినడానికి ప్రయత్నించండి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆకుకూరలు, అరటిపండు, అవకాడో వంటివి తినడం మంచిది.

55

మైగ్రేన్ నొప్పి వస్తే ఏం చేయాలి?

మైగ్రేన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే మంచు ముక్కలను ఒక గుడ్డలో చుట్టి తల, నుదురు, మెడ వెనుక భాగంలో 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి. ఇది కూడా మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది.

మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందాలంటే టిప్స్

మైగ్రేన్ నొప్పి నుండి శాశ్వతంగా ఉపశమనం పొందాలంటే మీరు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించండి. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె కలిపి తాగాలి. 30 రోజులు దీన్ని తాగితే మైగ్రేన్ మళ్లీ రాకుండా చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories