Lifestyle: ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. కానీ దానికి ఖరీదైన జీవనశైలి ఉండాలని కోరుకుంటారు. అయితే అవేవి కాకుండా రోజూవారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జీవితకాలం పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వయస్సు పెరిగేకొద్దీ కండరాల బలం తగ్గుతుంది. దీనిని తగ్గించడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా కీలకం. రెగ్యులర్‌గా వెయిట్ లిఫ్టింగ్ లేదా రెసిస్టెన్స్ వ్యాయామాలు చేస్తే కండరాలు రక్తంలో ఉన్న షుగర్‌ను మెరుగ్గా వినియోగిస్తాయి. దీంతో గ్లూకోజ్ నియంత్రణ మెరుగుపడుతుంది. పరిశోధనల ప్రకారం ఇలాంటి వ్యాయామాలు చేసే వారిలో టైప్-2 డయాబెటిస్ ప్రమాదం 30 నుంచి 50 శాతం వరకు తగ్గుతుంది. గుండె, మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
24
చక్కెర తగ్గిస్తే శరీరానికి లాభం
వయస్సు పెరుగుతున్నప్పుడు ఎక్కువ చక్కెర శరీరానికి హానికరం. అధిక షుగర్ తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో టిష్యూ డ్యామేజ్ కూడా జరుగుతుంది. కేవలం మూడు వారాల పాటు అదనపు చక్కెర తగ్గిస్తే శరీరంలోని వాపు దాదాపు 15 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన చక్కెర తగ్గిస్తే శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి, అలసట తగ్గుతుంది.
34
సమతుల్య వ్యాయామ అలవాటు
ఆరోగ్యకర జీవితం కోసం ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. వారంలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, మొబిలిటీ వ్యాయామాలు కలిపి చేయాలి. రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా తేలికపాటి కార్డియో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి మెటాబాలిజాన్ని సమతుల్యంగా ఉంచుతాయి.
మంచి నిద్ర నేరుగా జీవనకాలంపై ప్రభావం చూపుతుంది. సరిపడ నిద్ర హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది, శరీర రికవరీకి తోడ్పడుతుంది. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర తీసుకుంటే శక్తి స్థాయిలు మెరుగుపడతాయి, వ్యాధుల ముప్పు తగ్గుతుంది. నిద్రలో లోపం ఉంటే ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు.