Health Tips: అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే బెండకాయ.. వీరికి మాత్రం అస్సలు పనికిరాదు!

First Published | Nov 2, 2023, 1:34 PM IST

Health Tips: ఆకుపచ్చ రంగు కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే బెండకాయ కూడా చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ కొన్ని సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినకూడదు అంటున్నారు వైద్యులు. అది ఏమిటో చూద్దాం.
 

 బెండకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాపర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.

ముఖ్యంగా బెండకాయ తినటం వల్ల కళ్ళు మరియు ఎముకలకు చాలా మంచిది. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బెండకాయ చాలామందికి అనారోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. అయితే ఎలాంటి వారు ఈ బెండకాయ తినకూడదో చూద్దాం.
 


బెండకాయలు ఎక్కువగా తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం మరియు ఎసిడిటీ సమస్యలు వస్తాయి, బెండకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మితంగా తినాలి. కడుపు నొప్పి ఉన్నట్లయితే బెండకాయని తినకపోవడమే మంచిది. అలాగే ఎలర్జీ ఎక్కువగా ఉన్నవారు బెండకాయని తినకూడదు.
 

అలాగే కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతున్న వారు కూడా బెండకాయని దూరం పెట్టడం అవసరం. అలాగే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు లేదంటే దగ్గు మరియు సైనస్ సమస్యలు ఉన్నప్పుడు బెండకాయ తినటం మానుకోవాలి. బెండకాయలు ఎక్కువగా తినటం వల్ల అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల డయేరియా కి దారితీస్తుంది.
 

అలాగే బెండకాయ ఉడుకుతున్నప్పుడు జిగట పోవటం కోసం నువ్వు నేను ఎక్కువగా ఉపయోగించాలి. ఇలా వేయించేటప్పుడు ఎక్కువ మోతాదులో ఉన్న నూనె మన శరీరంలో కూడా ప్రవేశిస్తుంది తద్వారా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి బెండకాయని వేయించి తినటం కన్నా ఉడికించి తినటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
 

అలాగే బెండకాయ తిన్న తర్వాత ముల్లంగి తినకూడదు ఇలా చేయడం వలన చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అదేవిధంగా బెండకాయ తిన్న వెంటనే పచ్చిమిర్చి తినకూడదు ఇలా తింటే కడుపులో విషం తో పాటు ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోతుంది. కాబట్టి బెండకాయ తినటానికి జాగ్రత్తలు పాటించండి.

Latest Videos

click me!