చలికాలంలో రన్నింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published | Nov 2, 2023, 11:56 AM IST

చలికాలంలో రన్నింగ్ చేయడమంటే మామూలు విషయం కాదంటారు చాలా మంది. ఎందుకంటే వణికించే చలిలో పొద్దున్న లేచి రన్నింగ్ కు వెళ్లడం సవాలుగానే ఉంటుంది మరి. కానీ ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారంటున్నారు నిపుణులు. అవేంటంటే..

running

చలికాలం మొదలైంగి. ఇక ఈ చలికి చాలా మంది ఏడెనిమిది గంటలకు లేస్తుంటారు. రన్నింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలను పక్కన పెట్టేస్తుంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్లతో సంబంధం లేకుండా వ్యాయామం చేయాలి. చలికాలమని వేడి వేడి బజ్జీలు, సమోసాలు అంటూ నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. వీటివల్ల మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశముంది. అలాగే ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అయితే మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి ఖచ్చితంగా జిమ్ కు వెళ్లాల్సిన అవసరమేం లేదు. కానీ రన్నింగ్, జాగింగ్, వాకింగ్ వంటి అన్ ఎయిడెడ్ వ్యాయామాలను మాత్రం తప్పకుండా చేయాలి. అవును ఇవి మీకు చలికాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చలికాలంలో రన్నింగ్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

త్వరగా అలసిపోరు

ఒక అధ్యయనం ప్రకారం.. ఎండాకాలంలో కంటే చలికాలంలోనే థర్మల్ సెన్సేషనల్ లెవెల్ 32 శాతం ఎక్కువగా ఉంటుంది. థర్మల్ సెన్సేషనల్ లెవల్ అంటే చలికాలంలో రన్నింగ్ సమయంలో మీ కంఫర్ట్ లెవల్స్ పెరుగుతాయన్నమాట. అంటే చలికాలంలో మీరు సులువుగా పరుగెత్తగలుగుతారు. అలాగే చాలా త్వరగా అలసిపోయే అవకాశమే ఉండదు. అదే ఎండాకాలంలో అయినే కొద్దిసేపు పరుగెత్తగానే ఊపిరిని ఫాస్ట్ ఫాస్ట్ గా పీల్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆగుతారు.
 

Latest Videos


శరీరం వెచ్చగా ఉంటుంది

చలికాలంలో మీ శరీరం వెడక్కడానికి రన్నింగ్ కంటే బెస్ట్ ఆప్షన్ మరోటి లేదు. అవును రన్నింగ్ వల్ల మీ శరీరం తొందరగా వేడెక్కుతుంది. అందులోనూ ఈ సీజన్ లో చెమటలు చాలా తక్కువగా పడతాయి. ద డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. రన్నింగ్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతంది. దీంతో మీకు చల్లగా అనిపించదు. 
 

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

రన్నింగ్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. పరుగెత్తడం వల్ల మన గుండె తన పనిని మెరుగ్గా చేసుకోగలుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే మీరు ఈ సీజన్ లో రోజూ కాసేపు రన్నింగ్ చేస్తే కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు 30 నుంచి 40 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుందట. 
 

రన్నింగ్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

చలికాలంలో రన్నింగ్ చేసేటప్పుడు కూడా నిండుగా దుస్తులు ఉండాలి. వెదర్ చల్లగా ఉంటే క్యాప్ ను ఖచ్చితంగా పెట్టుకోండి. 

అలాగే పరిగెత్తేటప్పుడు రన్నింగ్ షూస్ ను ఖచ్చితంగా ధరించండి. 

మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నా, గాయం అయినా లేదా శస్త్రచికిత్స చేయించుకున్నా రన్నింగ్ చేయడానికి డాక్టర్ సలహాను తీసుకోండి. 

click me!