శరీర బరువుని తగ్గించే ప్రయత్నం చేసినట్లైనా, జీవక్రియ రేటుని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లయినా మీకు అంజీర్ అద్భుతంగా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు అంజిర్లను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు వాటిని పీల్చుకొని ఉబ్బి పోనివ్వండి. రోజూ ఉదయం ఈ నీరు తాగి నానబెట్టిన ఆ అంజీర్ తినటంతో మీ రోజుని ప్రారంభించండి.
అలా ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ నీరు తాగడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫైబర్ కంటెంట్ కారణంగా మెనోపాజ్ సమస్యలను మరియు హార్మోన్ల అసమతుల్యత నుండి రక్షిస్తుంది.
అలాగే మలబద్ధకంతో బాధపడే వారికి ఈ అంజీర్ నీరు ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ఈ అంజీర్ వాటర్ ని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే బరువు తగ్గించుకోవడానికి డైట్ లో ఉన్నట్లయితే అంజీర్ ని మీ ఆహార జాబితాలో చేర్చుకోవచ్చు.
అంజీర్ శరీరానికి ఫైబర్ యొక్క ఆరోగ్యకరమైన మోతాదుని అందిస్తుంది. అలాగే అంజీర్ వాటర్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని.. ఫ్రీ రాడికల్స్ ని వదిలించుకోవడానికి మరియు రక్తపోటుని తగ్గించడంలో సహాయపడతాయి. క్రమంగా కరోనరీ ఆర్టరీ బ్లాక్ ను నివారించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అంజీర్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఈ అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మెయింటెన్ అవుతాయి. ఇందులో ఉండే క్లోరోజెన్సీ ఆసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి టైప్ టు మధుమేహ వ్యాధికిలస్తులు అంజీర్ నీటిని తాగుతూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.