ఇంట్లోనే ఎంతో టేస్టీ కోవా బర్ఫీ స్వీట్... ఎలా తయారు చెయ్యాలంటే?

Navya G   | Asianet News
Published : Dec 09, 2021, 05:26 PM IST

 స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. స్వీట్ పదార్థాలు శుభానికి సంకేతం అని చెబుతారు. ఏదైనా శుభవార్త విన్నప్పుడు నోరు తీపి చేయాలని అంటారు. అందుకే ప్రతి పండగలోనూ తీపి పదార్థాలను తప్పక చేస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసుకునే స్వీట్ పదార్థాలకు బదులుగా కొత్తగా కోవా బర్ఫీ స్వీట్ (Kova Barfi Sweet) ట్రై చేయండి. పండగ సమయాల్లో ఇంటికొచ్చిన బంధువులకు, అతిథులకు పెట్టేందుకు ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఈ స్వీట్ ను తక్కువ సమయంలో చేసుకోవచ్చు. రుచి కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎంతో రుచికరమైన కోవా బర్ఫీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.  

PREV
17
ఇంట్లోనే ఎంతో టేస్టీ కోవా బర్ఫీ స్వీట్... ఎలా తయారు చెయ్యాలంటే?

కావలసిన పదార్థాలు: సగం  కప్పు కోవా (Kova), సగం కప్పు మైదా(Maida), సగం స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking soda), సగం స్పూన్ సొంపు (Anise), కొద్దిగా యాలకుల పొడి (Cardamo powder), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil), కప్పు చక్కెర (Sugar), రెండు స్పూన్ ల నెయ్యి (Ghee).
 

27

తయారీ విధానం: కోవా బర్ఫీ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో (Bowl) తీసుకుని అందులో సగం కప్పు కోవా, సగం కప్పు మైదా, సగం స్పూన్ బేకింగ్ పౌడర్, సగం స్పూన్ సొంపు, రెండు స్పూన్ ల నెయ్యి బాగా కలపాలి (Mix well).
 

37

ఇలా కలుపుకున్న పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు (Water) పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా పక్కన కలుపుకోవాలి. చక్కెర పాకం కోసం ఒక గిన్నెలో చక్కెర (Sugar) వేసి పావు కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
 

47

ఇలా మరుగుతున్న పాకంలో యాలకుల పొడి (Cardamom powder) వేసి లేతపాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం తయారు అయిన తరువాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని మందంగా తిక్కుకుని రాంబస్ ఆకారంలో (Shape) కట్ చేసుకోవాలి. 
 

57

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో  వేయించేందుకు సరిపడా ఆయిల్ (Oil) వేసి వేడిచేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన (Heated) తరువాత ఇందులో మందంగా ఒత్తుకున్న కోవా బిళ్లలను వేసి ఫ్రై చేసుకోవాలి.
 

67

తక్కువ మంట (Low flame) మీద రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ ఢీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఢీ ఫ్రై చేసుకున్న కోవాబిళ్ళలను చక్కెర పాకంలో వేసి పాకం పట్టే వరకు ఉంచి తరువాత ఒక ప్లేట్ (Plate) లో తీసుకోవాలి.
 

77

అంతే ఎంతో రుచికరమైన కోవా బర్ఫీ రెడీ (Delicious Cova Burfi Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ ను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తక్కువ పదార్థాలతో (With less ingredients), తక్కువ సమయంలో చేసుకునే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ మీకు బాగా నచ్చుతుంది.

click me!

Recommended Stories