తిన్న వెంటనే మందులు వేసుకుంటున్నరా? అయితే మీరిది తెలుసుకోవాల్సిందే..!

First Published Mar 5, 2024, 12:44 PM IST

సరైన అవగాహన లేకుండా మాత్రలు, మందులను వేసుకుంటే ఎన్నో వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలా మంది తిన్న వెంటనే ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

Medicines

మందులను ఎప్పుడు? ఎలా వేసుకోవాలో తెలియక చాలా మంది ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. అవును ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది మాత్రల దుర్వినియోగానికి గురవుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే మాత్రలను సరిగ్గా వేసుకోవకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిజానికి మాత్రలను డాక్టర్లు సూచించిన ప్రకారమే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే సమస్యలు తగ్గుతాయి. మనకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మాత్రం ఎన్నో రోగాల బారిన పడటం ఖాయమంటున్నారు నిపుణులు. అసలు మందులను సరిగ్గా వేసుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

టాబ్లెట్ ల కలయిక

వేర్వేరు వ్యాధులతో బాధపడుతున్నప్పుడు.. మీరు  ప్రతి మందును విడిగా, క్రమం తప్పకుండా తీసుకోవాలి. కానీ కొంతమంది ఒకే టైంలో వేర్వేరు మాత్రలను వేసుకుంటుంటారు. దీనివల్ల ట్యాబ్లెట్ల ప్రయోజనాలను పూర్తిగా గ్రహించే శరీర సామర్థ్యానికి ఆటంకం కలుగుతుంది. ఇది మందుల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను కూడా కలిగిస్తాయి. 
 

మందులపై అవగాహన లేకపోవడం..

డాక్టర్ ను అడగకుండా, తగిన అవగాహన లేకుండా ఫార్మసీల నుంచి ట్యాబ్లెట్లను కొని వాడే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మీ ఆరోగ్యాన్నిరిస్క్ లో పడేస్తుంది. సరైన ప్రిస్క్రిప్షన్ ఉన్న మందును మాత్రమే వాడాలి. లేదంటే ఎన్నో వ్యాధుల బారిన పడతారు. 
 


అధిక మోతాదు మాత్రలు

సిఫార్సు చేసిన మోతాదును ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మాత్రలను వేసుకుంటారు. కానీ మందులను ఎక్కువగా తీసుకుంటే అలసట, మైకంతో పాటుగా కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. అందుకే మోతాదుకు మించి మందులను వాడకూడదు. 
 

టాబ్లెట్లను తరచుగా వాడితే..

నిపుణుల సలహా లేకుండా తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు వంటి చిన్న చిన్న సమస్యలకు కూడా మందులను వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఊరికే మందులను వాడితే ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. 

Medicines

సూచించిన నియమాలను పాటించండి

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సూచించిన మందులనే వాడండి. అలాగే వాటిని ఎప్పుడెప్పుడు వాడాలో డాక్టర్ ను అడగండి. ప్రిస్క్రిప్షన్ మందులను సరిగ్గా వాడకపోతే ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. 

మాత్రలు ఎప్పుడు వేసుకోవాలి?

మాత్రలు ఎప్పుడు ఎలా వేసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. భోజనం చేసిన వెంటనే మందులను వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పోషక శోషణను నిరోధిస్తుంది. మాత్రలు తీసుకోవడానికి ఖచ్చితమైన సమయాన్ని డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. 

click me!