బరువు ఎక్కువుంటే ఏయే రోగాలొస్తయో తెలుసా?

First Published Mar 5, 2024, 11:52 AM IST

అధిక బరువు వ్యాధి కాకపోయినా.. ఇది మిమ్మల్ని ప్రాణాంతక రోగాల బారినపడేస్తుందనేది నిజం. అవును ఊబకాయం మీ ప్రాణాలను కూడా తీసేయగలదు. అసలు ఊబకాయంతో ఏయే రోగాలొస్తాయో తెలుసా? 
 

ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పెద్దలే కాదు పిల్లలు, టీనేజర్లు కూడా  దీని బారిన పడుతున్నారు. కానీ ఇది లైట్ తీసుకోవాల్సిన చిన్న సమస్య కాదు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. దీనిలో ఎన్నో రోగాలు ప్రాణాంతకం కూడా. క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. మన శరీరం కేలరీలను బర్న్ చేయలేనప్పుడు అది కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోవడం మొదలుపెడుతుంది. కానీ కొవ్వు కణజాలంలో కొవ్వును నిల్వ చేయడానికి శరీరానికి స్థలం లేనప్పుడు కొవ్వు కణాలు పెరగడం ప్రారంభిస్తాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే శరీరంలో మంట పెరుగుతుంది. దీనివల్లే లేనిపోని రోగాలు వస్తాయి. అసలు ఊబకాయం వల్ల ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

obesity


గుండె జబ్బులు, స్ట్రోక్

స్థూలకాయం కారణంగా శరీరంలో మంట పెరగడం మొదలవుతుంది. ఇది మన రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె ఆరోగ్యానికి చాలా డేంజర్. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం బాగా పెరుగుతుంది. అలాగే ఊబకాయం కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా పెంచుతుంది. ఎందుకంటే ఇది ధమనులను ఇరుగ్గా మారుస్తుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. 

డయాబెటిస్

ఊబకాయం వల్ల  రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగే ప్రమాదం ఇతరులకన్నా వీరికే చాలా ఎక్కువ. ఊబకాయం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇన్సులిన్ పెరగడం వల్ల మీ శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీనివల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. 
 

కొవ్వు కాలేయం

అధిక బరువు కారణంగా కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే ఈ సమస్యకు చికిత్స లేకపోవడం వల్ల ఇది లివర్ సిరోసిస్ కు కూడా కారణమవుతుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. అలాగే ఇది క్యాన్సర్ రిస్క్ ను కూడా పెంచుతుంది. 
 

Image: Getty

ఆర్థరైటిస్

శరీర బరువు పెరగడం వల్ల కీళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఎముకలు అరిగిపోవడం మొదలవుతుంది. అలాగే ఊబకాయం వల్ల కీళ్లలో వాపు కూడా వస్తుంది. దీంతో ఎముకల నొప్పి వస్తుంది. దీన్నే ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఇది వయస్సు పెరిగే కొద్దీ వస్తుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. కానీ ఊబకాయం కారణంగా చిన్న వయస్సులో కూడా ఈ సమస్య వస్తుంది. 
 

Image: Getty

స్లీప్ అప్నియా

ఊబకాయం వల్ల  శరీరంలోని కొవ్వు పెరిగి శరీరంలోని ప్రతి భాగంలో పేరుకుపోతుంది. గొంతులో కొవ్వు ఎక్కువగా ఉంటే నిటారుగా నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు. వల్ల గాలి పైపు బ్లాక్ కావడం ప్రారంభమవుతుంది. దీనిని స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా వల్ల నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా శ్వాస ఆగిపోతుంది. దీని వల్ల నిద్రపోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే కంటినిండా నిద్ర పోరు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
 


క్యాన్సర్

మాయో క్లినిక్ ప్రకారం.. ఊబకాయం గర్భాశయ, పెద్దప్రేగు, పురీషనాళం, అండాశయం, రొమ్ము, గర్భాశయం, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి  ఎన్నో క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

డిప్రెషన్

ఊబకాయం క్లినికల్ డిప్రెషన్, యాంగ్జైటీ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు వంటి స్థూలకాయానికి కారణమయ్యే కారకాలు డిప్రెషన్ ప్రమాదాన్ని చాలా పెంచుతాయి. 

obesity woman

అధిక రక్తపోటు

స్థూలకాయం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. దీని వల్ల రక్తపోటు ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. అలాగే చక్కెర లెవెల్స్, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. అధిక రక్తపోటు సమస్యను హైపర్ టెన్షన్ అంటారు. దీనివల్ల రక్త నాళాలపై చాలా ఒత్తిడి పడుతుంది. అలాగే ఇవి పగిలిపోవడం లేదా గడ్డకట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది.
 

click me!