తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయడం మంచిదా... అధిక మొత్తంలో ఒకేసారి తినడం మంచిదా?

Published : Dec 17, 2022, 03:32 PM IST

ప్రస్తుత కాలంలో భోజనం ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా తక్కువ మొత్తంలో అధిక సార్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.  

PREV
13
తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయడం మంచిదా... అధిక మొత్తంలో ఒకేసారి తినడం మంచిదా?

Curd riceమారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎంతో మంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. గతంలో ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలను రోజుకు చాలా తక్కువ సార్లు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పై దృష్టి ఉంచి తక్కువ మొత్తంలో ఆహార పదార్థాలను ఎక్కువసార్లు తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

23

ఈ విధంగా ఆహార పదార్థాలను తక్కువ తక్కువగా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మన శరీరంలో శక్తిని కోల్పోనివ్వకుండా శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. అదేవిధంగా మనం తక్కువ మోతాదులో ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోదు తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవని నిపుణులు చెబుతున్నారు.
 

33

ఎక్కువ మొత్తంలో తక్కువసార్లు ఆహార పదార్థాలను తినేవారికంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహార పదార్థాలు తినే వారిలో మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉంటారని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహార పదార్థాలు తినే వారిలో మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు చాలా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా శరీర బరువు కూడా తగ్గుతారని పలు అధ్యయనాలు తెలియజేశాయి. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎంతో నాణ్యత కలిగినవై ఉండాలి. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తృణధాన్యాలు గింజలు పాల ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

click me!

Recommended Stories