ఇలాంటి హోమ్ రెమెడీస్ ఇంట్లో పాటిస్తున్నారా.. ఇవి ఆరోగ్యానికి ఎంతో హానికరమని తెలుసా?

First Published Dec 17, 2022, 3:03 PM IST

సాధారణంగా చాలామంది చిన్నచిన్న గాయాలకు ప్రమాదాలకు హోమ్ రెమిడీస్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అన్నిసార్లు ఈ హోమ్ రెమెడీస్ ఎంతో ప్రమాదకరమైనవి. మరి ప్రమాదకరమైన హోమ్ రెమిడీస్ ఏంటో చూద్దాం....
 

సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి మసాలా దినుసులను ఉపయోగించి ఎన్నో హోం రెమిడీస్ తయారు చేసుకొని చిన్నచిన్న నొప్పుల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. ఇలాంటి హోం రెమిడీస్ ద్వారా కొంతమేర ఇంగ్లీష్ మందులను కూడా అవాయిడ్ చేస్తున్నాము. అయితే ఇది మంచి విషయమే అయినప్పటికీ కొన్నిసార్లు ఇది కూడా ప్రమాదకరంగా మారుతుంది.
 

ఇలా మన ఇంట్లో నిత్యం మనం పాటించే హోం రెమెడీస్ ఎంతటి ప్రమాదకరంగా ఉంటాయో వాటి వల్ల ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం... సాధారణంగా మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు పొరపాటున నూనె మన చేతులపై పడుతుంది. ఇలా నూనె మన చేతి పై పడినప్పుడు చల్లదనం కోసం వెన్న రాయడం లేదా పేస్ట్ రాయడం వంటివి చేస్తుంటారు.
 

ఈ విధంగా వెన్న రాయడం పూర్తిగా ప్రమాదకరం. ఇలా నూనె మన చేతి మీద పడినప్పుడు వెంటనే మరి చల్లని నీటిలో కాకుండా మధ్యస్థంగా చల్లగా ఉన్న నీటిలో ఓ 20 నిమిషాల పాటు పెట్టాలి. ఇలా 20 నిమిషాల పాటు చేతిని నీళ్లలో ఉంచడం వల్ల గాయం తీవ్రత ఎక్కువ కాకుండా ఉంటుంది.
 

ఈ విధంగా వెన్న రాయడం పూర్తిగా ప్రమాదకరం. ఇలా నూనె మన చేతి మీద పడినప్పుడు వెంటనే మరి చల్లని నీటిలో కాకుండా మధ్యస్థంగా చల్లగా ఉన్న నీటిలో ఓ 20 నిమిషాల పాటు పెట్టాలి. ఇలా 20 నిమిషాల పాటు చేతిని నీళ్లలో ఉంచడం వల్ల గాయం తీవ్రత ఎక్కువ కాకుండా ఉంటుంది.
 

ఇకపోతే చాలామంది మొహంపై మొటిమలు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి మొటిమలను తగ్గించుకోవడానికి టూత్ పేస్ట్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే టూత్ పేస్ట్ తో పాటు ఇతర ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మన చర్మం పై ఎంతో చికాకుగా ఉండడమే కాకుండా నొప్పి తీవ్రతను అధికం చేస్తుంటాయి.
 

చాలామంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మౌత్ వాష్ పుక్కలించడం వల్ల మనం ఈ నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని భావిస్తుంటారు అయితే మౌత్ వాష్ ద్వారా పుక్కిలించడం వల్ల నొప్పి తీవ్రత అధికమవుతుంది ఇలాంటి సమయంలో ఏమి మాట్లాడకుండా కాసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. అయితే వీలైనన్ని ఎక్కువగా నీళ్లు తాగడం ఎంతో మంచిది.
 

పంటి నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి విస్కీ ఉపయోగిస్తూ ఉంటారు. విస్కీలో మత్తుమందు లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అయితే ఇలా విస్కీతో పంటి నొప్పి సమస్యకు చెక్ పెట్టాలని ప్రయత్నం చేసిన ఎటువంటి హాని ఉండకపోయినా ట్రీట్మెంట్ మనం ఆలస్యం చేస్తే మరింత నొప్పి సమస్యతో బాధపడతారు.అందుకే కొన్ని రకాల హోమ్ రెమెడీస్ పాటించకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

click me!