ఇవి యోని వాసనను పెంచుతయ్.. అందుకే ఈ తప్పులు చేయకండి

First Published | Oct 2, 2023, 3:34 PM IST

యోనిని శుభ్రంగా ఉంచడానికి, వాసన రాకుండా చేయడానికి కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చెడు వాసన పెరుగుతుందే కానీ అస్సలు తగ్గదు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉందా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్టే మరి. 
 

సాధారణంగా యోని తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది. కానీ కొంతమంది ఆడవారికి మాత్రం అక్కడి నుంచి చెడు వాసన ఎక్కువగా వస్తుంటుంది. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా చేపల వాసనలా వస్తుంది. ఇన్ఫెక్షన్ లేదా ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల ఇలా యోని నుంచి చెడు వాసన ఎక్కువగా వస్తుంది. అయితే ఈ చెడు వాసన రావడానికి యోని పరిశుభ్రత కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణఉలు. మరి యోని వాసనకు కారణమయ్యే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అతిగా కడగడం

యోనిని ఖచ్చితంగా శుభ్రంగా ఉంచాలి. అలాగని దీనిని అతిగా కడిగితే యోని సహజ పిహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో అక్కడ దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. యోని సాధారణ పిహెచ్ పరిధి 3.8, 5 మధ్య ఉంటుంది. మీ యోని పిహెచ్ స్థాయిలు హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలను దూరంగా ఉంచడానికి బాధ్యత వహిస్తాయి. కానీ పిహెచ్ బ్యాలెన్స్ దెబ్బతింటే యోని సమస్యలు వస్తాయి. 

Latest Videos


కఠినమైన సబ్బులు లేదా ఇంటిమేట్ వాష్ లను ఉపయోగించడం

రసాయనాలు, సువాసనలతో నిండిన సబ్బులు, సన్నిహిత వాష్ లను ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి యోనిని చికాకు పెడతాయి. అందుకే ఇలాంటి వాటిని అస్సలు ఉపయోగించకండి. 
 

డౌచింగ్

యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోని డౌచింగ్ ను ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది యోనికి అస్సలు మంచిది కాదు. ఇది ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. ఇది అసమతుల్యత, యోని దుర్వాసనకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఇది యోనిలో మంటను కలిగిస్తుంది. 
 

టైట్ గా ఉండే లోదుస్తులు

టైట్ లా, గాలి తగలని లోదుస్తులను వేసుకునే అలవాటు చాలా మందికే ఉంటుంది. కానీ ఈ రకమైన దుస్తులు తేమను ట్రాప్ చేస్తాయి. అలాగే అక్కడ బ్యాక్టీరియా కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల కూడా యోని నుంచి చెడు వాసన వస్తుంది. 

నెలసరి పరిశుభ్రత

పీరియడ్స్ అయితే చాలా మంది యోని పరిశుభ్రతను పట్టించుకోరు. పీరియడ్స్ టైంలో ప్రతి నాలుగైదు గంటలకోసారి శానిటరీ ప్యాడ్స్ ను ఖచ్చితంగా మార్చాలి. ఒకవేల వీటిని ఇలా మార్చకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల యోని నుంచి చెడు వాసన వస్తుంది. 

click me!