రక్తం ద్వారా ఈ వ్యాధులొస్తయ్ జాగ్రత్త..

First Published | Oct 3, 2023, 3:45 PM IST

రక్త మార్పిడి కూడా ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. రక్తంలో ఉండే వైరస్ లు, బ్యాక్టీరియా వంటి రక్తం ద్వారా వ్యాపించే వ్యాధికారకాలు ఎన్నో వ్యాధులను కలిగిస్తాయి. అందుకే రక్తం మార్పిడి చేసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అధిక రక్తస్రావం, రక్తం అందకపోవడం వల్ల  ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ తలసేమియా, సికిల్ సెల్ రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ రోగులకు రక్త మార్పిడి చాలా చాలా అవసరం. ఈ పేషెంట్లు కొన్ని రోజుల్లోనే రక్త మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వీళ్లు దానం చేసిన రక్తాన్ని తీసుకుంటారు. అందుకే రక్తదానాన్ని మహాదానం అంటారు. ఏదేమైనా రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు భారతదేశంలో ఒక పెద్ద ఆరోగ్య సవాలుగా మారాయి. అవును ఇది ప్రతి ఏడాది మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తమార్పిడి ద్వారా హెచ్ఐవి, హెపటైటిస్-బి, సి వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. దీని నుంచి కోలుకోవాలంటే రోగికి సకాలంలో వైద్యం అందడం చాలా చాలా ముఖ్యం. 
 

రక్త మార్పిడితో సంబంధం ఉన్న ప్రమాదాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తదానం చేసేటప్పుడు హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే తలసేమియా వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయించుకోవాల్సిన ప్రమాదం మరింత పెరుగుతుంది. దీనిపై పరిజ్ఞానం లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్లే రక్తమార్పిడి ద్వారా ఈ ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. 

Latest Videos


blood donation

రక్త మార్పిడి వల్ల వచ్చే వ్యాధులు

బ్లడ్‌బోర్న్ పాథోజెన్‌లు వైరస్‌లు లేదా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు.. రక్తంలో చేరి వ్యాధిని కలిగిస్తాయి. మలేరియా, సిఫిలిస్, బ్రూసెల్లోసిస్, ముఖ్యంగా హెపటైటిస్ B (HBV), హెపటైటిస్ C (HCV) హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV)తో సహా అనేక రకాల రక్తసంబంధమైన వ్యాధికారకాలు ఉన్నాయి.
 

world blood donor day


రక్త మార్పిడి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

ఒకే సూదిని ఎక్కువ మందికి ఉపయోగించడం

రక్తాన్ని టెస్ట్ చేయకుండానే పేషెంట్ కు ఎక్కించడం. ఇది రక్తం ద్వారా సంక్రమించే అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

పచ్చబొట్టు వేయించుకోవడం ద్వారా కూడా ఈ రకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. 

వైద్య పరికరాలను సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవడం

రక్త మార్పిడితో సంబంధం ఉన్న ప్రమాదాలను ఎలా తగ్గించాలి?

సురక్షితమైన ఇంజెక్షన్లను ఉపయోగించడం చాలా అవసరం. అంటే ఒకరికి యూజ్ చేసిన ఇంజెక్షన్లను వేరేవాళ్లకు ఉపయోగించకూడదు
రక్తం, అవయవ దానం సమయంలో స్క్రీనింగ్ చాలా ముఖ్యం.

click me!