డెంగ్యూ దోమ కుట్టిన తర్వాత ఆ లక్షణాలు మనకి కనిపించటానికి మూడు నుంచి 14 రోజులు సమయం పడుతుంది. హై ఫీవర్,తలనొప్పి, వాంతులు, కండరాలు కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే డెంగ్యూ జ్వరం మీకు సంక్రమించినట్లే. ఈ జ్వరం నుంచి కోలుకోవటానికి రెండు నుంచి వారం రోజుల సమయం పడుతుంది.
అయితే ఈ సమయంలో ప్లేట్లెట్లు పడిపోకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు మన శరీరంపై ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలతో దద్దుర్లు ఏర్పడతాయి అలాగే ముక్కు మూసుకుపోవటం, చిగుళ్లలో రక్తస్రావం కలగటం అలాగే భారీ ఋతు రక్తస్రావం కలగటం.
మీ మలమూత్రాలలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అటువంటప్పుడు మనం వెంటనే తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. మెంతి గింజలని 10 నిమిషాల సేపు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి తాగటం వలన ప్లేట్లెట్ల కౌంట్ సత్వరంగా పెరిగిపోతుంది. ప్లేట్లెట్ల కౌంట్ వేగంగా పడిపోతున్న వ్యక్తులకు ఇది మంచి ఔషధం.
అలాగే బొప్పాయి ఆకుల రసం కూడా ప్లేట్లెట్లు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఎసిటోజేనిన్ అనే ఫైటో కెమికల్ ప్లేట్లెట్లను వేగంగా అభివృద్ధి చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకులని నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి ఆ ద్రవాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
అలాగే గోధుమ గడ్డి రసం తాగటం వలన కూడా ప్లేట్లెట్లు సత్వరమే పెరుగుతాయి. అలాగే బీట్రూట్ రసం తాగటం వలన కూడా పడిపోతున్న ప్లేట్లెట్ల సంఖ్య పెరగడమే కాకుండా హిమోగ్లోబిన్ ని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది.
అలాగే కివి పండ్లు పడిపోతున్న ప్లేట్లెట్ల రికవరీ కి ఉత్తమమైన ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం ప్లేట్లెట్ల అకౌంట్ ని సత్వరమే పెంచుతుంది. ప్లేట్లెట్లు పడిపోయిన తరువాత అని కాకుండా డెంగ్యూ ఫీవర్ అని తెలిసిన వెంటనే వీటిని తీసుకోవడం మొదలుపెడితే ప్లేట్లెట్లు పడిపోవటం అనే సమస్యకు చెక్ పెట్టవచ్చు.