మనిషికి నిద్ర చాలా అవసరం. సరిపడా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... అలా అని అతిగా నిద్రపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది అలసిపోయామని.. మరీ ఎక్కువగా నిద్రపోతుంటారు. ఎంతలా అంటే.. రోజంతా నిద్రపోతూ ఉంటారు. రోజుకి ఎనిమిది గంటలకంటే మరీ ఎక్కువ నిద్రపోయే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. తాజా అధ్యయనంలో ఈ విషయం నిరూపితమైంది.
28
రోజువారీ కార్యకలాపాలతో పాటు... ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవనశైలితో పోరాడుతున్నారు. దీంతో వారు గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు.
38
నైట్ షిఫ్ట్ చేసేవారు రోజంతా నిద్రపోతారు, పగలు పని చేసేవారు రాత్రి అలసటతో త్వరగా నిద్రపోతారు. ఆరోగ్యానికి నిద్ర అవసరమనేది నిజం. కానీ అధిక నిద్ర ఆరోగ్యానికి అవసరం లేదు. బదులుగా ఇది వ్యాధులకు దారి తీస్తుంది.
48
రోజుకు 8 గంటలు నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 8 గంటల నిద్ర మిమ్మల్ని ఎలాంటి ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోయేవారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో ఓసారి చూద్దాం...
58
రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాల ద్వారా నిపుణులు నిరూపించారు. అతిగా నిద్రపోవడం వల్ల శరీర బరువు పెరగడమే కాకుండా కొవ్వు పేరుకుపోయి గుండె సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటు తలనొప్పి, వెన్నునొప్పి, గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
68
అతిగా నిద్రపోయే వ్యక్తులు తీవ్రమైన డిప్రెషన్, తలనొప్పి, అసాధారణ హృదయ స్పందనలు , మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం కనిపిస్తుంది. అలాగే ఎక్కువసేపు నిద్రపోయే వారి జీవితకాలం కూడా తక్కువే.
78
good sleep
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే యోగా సాధన చేయడం, ఎక్కువసేపు నిద్రపోకుండా కేవలం ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోవడం చాలా మంచిది. పగటి నిద్రకు వీలైనంత దూరంగా ఉండాలి. అదేవిధంగా, రోజంతా ఎక్కువ శారీరక శ్రమను పొందడం వల్ల మీరు రాత్రిపూట వేగంగా నిద్రపోవచ్చు.
88
అలాగే నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే మద్యం, ధూమపానం వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే మద్యం, ధూమపానం వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.