మైదాపిండి వంటకాలను ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్య రావడం ఖాయం!

First Published Jan 19, 2022, 5:26 PM IST

మైదా (Maida) పిండితో అనేక రకాల వంటలను తయారు చేస్తుంటారు. ఈ పిండితో తయారు చేసుకున్న పదార్థాలు రుచిగా ఉన్న శరీరానికి హాని కలిగిస్తాయి. ఈ పిండిని వంటలలో ఎక్కువగా వాడితే అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) వచ్చే అవకాశాలు   ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మైదా పిండితో కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

మైదా పిండిని ఎక్కువగా హోటళ్లలో రోటీలు తయారు చేయడానికి, బేకరీ ఐటమ్స్ (Bakery Items) లలో వాడుతుంటారు. ఈ పిండిని రుచికోసం వాడితే అనేక అనారోగ్య సమస్యలను మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ పిండి ఆరోగ్యంపై ప్రభావితం (Affected) చూపుతుంది. ఈ పిండిని గోడలకు కాగితాలను, పుస్తకాలను అనిపించుకోవడానికి ఎక్కువగా వాడుతుంటారు. 
 

గోధుమ పిండిని బాగా ప్రాసెస్ చేసి మైదా పిండిని తయారు చేస్తారు. కనుక మైదాపిండి గోధుమపిండి కంటే తెల్లగా ఉంటుంది. మైదా పిండిలో పోషకాలు విలువలు (Nutrient values) శూన్యం. మైదాపిండి జిగురు తత్వాన్ని కలిగి ఉంటుంది. కనుక మైదాతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే పేగులకు అతుక్కుపోయి బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ (Infection) లు కలిగే ప్రమాదం వుంటుంది.
 

మైదా అధిక గ్లైసీమిక్ (Glycemic) విలువలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తొందరగా కలవడానికి సాయపడతాయి. దీంతో మైదా పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ లెవెల్స్ (Sugar levels) అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. కనక మైదాపిండిని వాడకపోవడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు.
 

ఈ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం (Obesity) ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కావాలంటే శరీరానికి పీచు పదార్థాలు తప్పనిసరిగా అందించాలి. కానీ మైదాపిండిలో పీచు పదార్థం (Fiber) ఉండదు. కనుక ఇది తొందరగా జీర్ణం కాదు. పేగులలో పేరుకుపోయి పేగుల్లో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
 

ఇలా పేగుల్లో ఏర్పడిన పుండ్లు కారణంగా క్యాన్సర్ (Cancer) వంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తే కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. అలాగే గుండె జబ్బులు (Heart disease) వచ్చే అవకాశం ఎక్కువ. మైదా పిండితో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళల్లో బ్రెస్ట్ సంబంధిత సమస్యలు వస్తాయి.
 

మైదా పిండిలో ఎటువంటి ప్రోటీన్లు ఉండవు. ఈ పిండిని తక్కువగా ఉపయోగించడమే మంచిది. మైదాకు బదులుగా గోధుమపిండిని ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజూ మైదాతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం (Harmful). నోటికి రుచిని అందించడం కోసం మైదాపిండిని వాడితే మన జీవితకాలాన్ని (Life time) మనమే తగ్గించు కున్నట్లు అవుతుంది.

click me!