Cooking Oil: వంటకు ఏ నూనె ఎలా వాడాలి? ఆరోగ్యానికి ఏ నూనె మంచిది? ఒకే రకం నూనె వాడితే ఏమవుతుంది?

Published : Oct 13, 2025, 06:52 PM IST

వంట చేయడానికి రకరకాల నూనెలు వాడుతుంటాం. కానీ ఏ నూనె ఎలా వాడాలి? ఏ వంటలకు వాడాలి? వంటి విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. దానివల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంటుంది. మరి వంటలకోసం ఏ నూనె వాడాలి? ఒకే నూనె ఎక్కువకాలం వాడితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

PREV
17
వంట నూనె రకాలు

వంట చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో నూనె ఒకటి. నూనె వంటలకు రుచిని పెంచడమే కాదు.. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కాబట్టి సరైన మోతాదులో నూనె తీసుకోవడం అవసరం. అయితే చాలామంది వంటలకోసం రకరకాల నూనెలు వాడుతుంటారు. కొందరు సన్ ఫ్లవర్ ఆయిల్, మరికొందరు ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, నెయ్యి వంటివి వాడుతుంటారు. కానీ ఏ నూనె ఎలా వాడాలి? ఏ వంటలకు వాడాలి? ఎక్కువ రోజులు ఒకే రకమైన నూనె వాడితే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

27
ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి చర్మం, జుట్టు, ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే ఆలివ్ ఆయిల్ ని సలాడ్స్, కూరగాయలను లైట్ గా వేయించడం, ఇటాలియన్ వంటలకోసం ఉపయోగించడం మంచిది. పూరీల వంటివి తయారు చేయడానికి ఈ నూనె వాడకూడదు. ఎందుకంటే దీని స్మోక్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల నూనెను ఎక్కువ వేడిచేసినప్పుడు ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు రిలీజ్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

37
సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఇ, మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ డీప్ ప్రైలకు చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీనిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇతర నూనెలతో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో మంట, వాపు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. 

47
ఆవ నూనె

ఆవనూనెలో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సంప్రదాయ వంటలు, నిల్వ పచ్చళ్లకు దీన్ని ఉపయోగించవచ్చు.

57
కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను కేరళలో వంటతో పాటు ఇతర అవసరాలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనె తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే దీనిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొబ్బరినూనెను తక్కువ వాడటం మంచిది. 

67
నెయ్యి

నెయ్యి రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలామంచిది. దీంట్లో విటమిన్ A, D, E, K, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మెరుగైన జీర్ణక్రియకు, ఎముకల దృఢత్వానికి, పేగు ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది. అయితే కదలకుండా వర్క్ చేసే లైఫ్ స్టైల్ ఉన్నవారు నెయ్యిని తక్కువగా తీసుకోవడం మంచిది.

77
ఫైనల్ గా..

ఏ నూనెను ఎలా ఉపయోగించాలో.. అలా ఉపయోగిస్తేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబున్నారు. ముఖ్యంగా ఏ ఒక్క నూనెను ఎక్కువ రోజులు వాడకూడదని.. ఆరోగ్యంగా ఉండాలంటే, నూనెలను మార్చి మార్చి ఉపయోగించాలని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories