Summer: ఎండలని కూల్ వాటర్ తాగుతున్నారా? తర్వాత జరిగేది ఇదే..!

Published : Apr 15, 2026, 08:32 PM IST

Summer: ఎండలు దంచేస్తున్నాయి. ఇంటికి రాగానే గొంతులో కూల్ వాటర్ పడితే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. శరీరం డీహైడ్రేట్‍గా ఉండాలని నీరు తాగడం మంచిదే అలా అని వేడి తట్టుకోలేక ఫ్రిడ్జ్ లో వాటర్ తాగేస్తున్నారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

PREV
15
ఏది ఉత్తమం?
ఎండలు మండిపోతున్నాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఈ టైంలో వేడి నీళ్లు తాగాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఫ్రిజ్‌లోని చల్లటి నీళ్లకే అందరూ ఓటేస్తారు. కానీ ఆరోగ్యానికి ఏది మంచిది? ఇక్కడ తెలుసుకుందాం.
25
చల్లని నీరు తాగితే కలిగే ప్రభావాలు

చల్లటి నీళ్లు తాగగానే అప్పటికీ హాయిగా అనిపిస్తుంది. కానీ, ఎక్కువగా కూల్ వాటర్ తాగితే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. చల్లటి నీళ్లు శరీర లోపలి ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించేస్తాయి. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాక అజీర్తి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా భోజనం తర్వాత చల్లటి నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు.

35
వేడి లేదా గోరువెచ్చని నీటి ప్రయోజనాలు

గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. వేసవిలో అయినా సరే, ఉదయాన్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మెటబాలిజాన్ని (Metabolism) పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

45
గోరువెచ్చని నీరు ఉత్తమం

వేసవిలో మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉన్న నీటి కంటే గది ఉష్ణోగ్రత (Room Temperature) వద్ద ఉన్న నీటిని తాగడమే ఉత్తమమైన మార్గం. ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎండలో నుంచి వచ్చిన వెంటనే ఫ్రిజ్ నీళ్లు తాగొద్దు. గుర్తుంచుకోండి..

55
రోజుకు ఎంత నీరు తాగాలి?
డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడకుండా ఉండాలంటే రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. చెమట ఎక్కువగా పట్టేవారు ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం కూడా శరీరానికి చలవ చేస్తుంది.
Read more Photos on
click me!

Recommended Stories