వాతావరణంలో మార్పు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కానీ ఈ సీజనల్ మార్పులు మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. నిజానికి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీర ఉష్ణోగ్రత కూడా మారుతుంది. కానీ దీనివల్ల తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. ఈ వాతావరణ మార్పులతో పాటుగా మన జీవనశైలి పొరపాట్ల వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. సీజనల్ ఫ్లూ నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హైడ్రేట్ గా ఉండటం
నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం తగ్గుతుంది. ఇది బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని నివారిస్తుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా నీటిని పుష్కలంగా తాగాలి. దీనివల్ల మీ శరీరంలో ఉండే విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. ఇందుకోసం నీళ్లతో పాటుగా కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి నేచురల్ హెల్తీ డ్రింక్స్ ను తాగండి. ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
తాజా పండ్లు, కూరగాయలు
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ కూరగాయలను, తాజా పండ్లను తినాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ను తాగడం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇవి గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
పరిశుభ్రత
బయటినుంచి మీరు ఇంటికి రాగానే కళ్లు, చేతులను ఖచ్చితంగా కడుక్కోవాలి. అలాగే బట్టలను కూడా మార్చుకోవాలి. ఎందుకంటే బయటక తిరగడం వల్ల బాగా అలసిపోతారు. అలాగే చెమట కూడా పడుతుంది. ఇవి మీ సమస్యలను పెంచుతుయ్. అందుకే చేతులు, కాళ్లు కడిగిన తర్వాత శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. అప్పుడే మీకు రీఫ్రెష్ అనుభూతి కలుగుతుంది.
ఈ వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దు
దగ్గు, జబులు, జ్వరం ఉన్నవారితో సన్నిహితంగా ఉండటం వల్ల మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఇలాంటి సమస్యలున్న వారితో ఎక్కువగా మాట్లాడటం, వారికి సన్నిహితంగా ఉండటం మానుకోండి. అలాగే మాస్క్ ను ఖచ్చితంగా పెట్టుకోండి.
cough
చికిత్స అవసరం
కొన్నికొన్ని సార్లు చిన్న దగ్గు, జలుబు కూడా పెద్ద ప్రమాదానికి సంకేతం కావొచ్చు. అంుదకే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి గొంతు నొప్పి అనిపించిన వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
Image: Getty Images
జలుబు, దగ్గును తగ్గించే ఇంటి చిట్కలు
గార్గిల్
గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలపండి. వీటిని నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయం లేచి కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే గొంతునొప్పి పూర్తిగా పోతుంది.
అల్లం, తేనె
అల్లంలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే అల్లం జలుబును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక అంగుళం అల్లం రసాన్ని తీసి అర టీస్పూన్ తేనెను దానిలో కలిపి నెమ్మదిగా దీన్ని తినండి దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గొంతులో వాపు, జలుబు దగ్గు సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
విటమిన్ సి
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు మన శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. విటమిన్ సి శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారిస్తుంది. అలాగే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం కివీ, నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి. దీనివల్ల వాతావరణంలో మార్పులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవు.