ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో చాలా మందికి తెలుసు. రోజుకో ఆపిల్ ను తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదన్న ముచ్చట కూడా మనందరికీ తెలుసు. ఆపిల్స్ లో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షస్తాయి. ఆపిల్ ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దాని రసం తాగడం వల్ల కూడా అన్ని ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఈ ఆపిల్ జ్యూస్ లో మన శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్-సి, పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ ను తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే?
గుండె ఆరోగ్యానికి మంచిది
ఆపిల్ జ్యూస్ మన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను పరిగడుపున తాగడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో ఉండే పెక్టిన్, ఫైబర్ లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో మీకు గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.
apple juice
బరువును నియంత్రిస్తుంది
బరువు తగ్గాలనుకునేవారికి ఆపిల్ జ్యూస్ బెస్ట్ డ్రింక్ అనే చెప్పాలి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆపిల్ జ్యూస్ ను తాగడం మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
కంటి చూపును మెరుగుపరుస్తుంది
ఆపిల్స్ విటమిన్-ఎ కు మంచి వనరు. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది స్క్రీన్లపై ఎక్కువసేపు పనిచేస్తారు. కానీ దీనివల్ల కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కంటిచూపు కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు మీ కంటి చూపును మెరుగుపరచడానికి ఆపిల్ జ్యూస్ ను రోజూ తాగొచ్చు.
Image: Freepik
ఉబ్బసం రోగులకు ప్రయోజనకరం
ఆపిల్ జ్యూస్ ఆస్తమా రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తమా పేషెంట్లు ఈ జ్యూస్ ను రోజూ పరిగడుపున తాగడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఆపిల్ జ్యూస్ లో పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి ఆపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా పరిగడుపున తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గట్ లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది.