మందార టీ తో ఇన్ని లాభాలా?

First Published | Sep 30, 2023, 7:15 AM IST

మందార టీని తాగే వారు చాలా తక్కువే. కానీ ఈ టీ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ టీని తాగడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బరువు కూడా సులువుగా తగ్గుతారు. అంతేకాదు.. 
 

hibiscus tea

మందార పవ్వులు ఎంతో అందంగా ఉంటాయి. అంతేకాదు ఈ పువ్వులో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి తెలుసా? ఈ పువ్వుతో చేసిన టీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఎర్రటి అమృతాన్ని ఎన్నో శతాబ్దాలుగా కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు. మరి మందార టీని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

మందారం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఎర్రని పానీయంలో ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఇతర శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. మందార టీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.


గుండె ఆరోగ్యానికి..

మందార టీ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలో రక్త నాళాలను సడలించే సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

hibiscus tea

వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారికి మందార టీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఈ మూలికా కషాయం మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే  ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఈ టీ మన జీవక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ టీ అనే చెప్పాలి. 
 

రక్తంలో చక్కెర స్థాయిలను..

మందార టీ మధుమేహులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ టిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారిలో. మందార పూవులోని యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడతాయి. అయినప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు మందార టీని తాగే ముందు డాక్టర్ ను సంప్రదించాలి. 

hibiscus tea

జీర్ణ ఆరోగ్యానికి మద్దతు

మందార టీలో సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. ఈ టీని తాగితే మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. భోజనం చేసిన తర్వాత మందార టీ ని తాగడం వల్ల మంచి పోషక శోషణ అందుతుంది. ఇది మన మొత్తం జీర్ణ సౌకర్యాన్ని ప్రోత్సహిస్తుంది.
 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మందారం టీ లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ముఖ్యమైన పోషకం తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాలు అంటుకునే ప్రమాదం తగ్గుతుంది. మందార టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. 
 

చర్మ ఆరోగ్యం 

మందార టీ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ముడతలు లేకుండా యవ్వనంగా ఉంచుతాయి. దీనిలోని శోథ నిరోధక లక్షణాలు మొటిమలు,  తామర వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి సహయపడతాయి. 

Latest Videos

click me!