ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా... మీరు ఈ సమస్య బారిన పడినట్లే!

Published : Dec 07, 2022, 02:16 PM IST

సాధారణంగా కొందరు తరచూ ఆవలింతలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఆవలింతలతో బాధపడేవారి మెదడుకు సరైన ఆక్సిజన్ అందలేదని అర్థం.  

PREV
15
ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా... మీరు ఈ సమస్య బారిన పడినట్లే!

సాధారణంగా మనకు ఆవలింతలు రావడం అనేది మనలో జరిగే ఒక ప్రక్రియ. మనకు నిద్ర వచ్చినప్పుడు ఇలా ఆవలింతలు రావడం జరుగుతుంది. అయితే రోజులో చాలా తక్కువ శాతం మంది ఆవలిస్తూ ఉంటారు. ఇలా కాకుండా ప్రతి పావుగంటకు ఆవలింతలు రావడం లేదా తరచూ గట్టిగా ఆవలింతలు వస్తూ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా వైద్యుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
 

25

తరచూ ఆవలింతలు వస్తున్నాయి అంటే మనకు నిద్ర వస్తుందని అర్థం కాదు మనం ఎంతో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్నామని సంకేతం.ఇలా తరచూ ఎప్పుడైతే ఆవలింతలు వస్తున్నాయో ఆ సమయంలో మన మెదడుకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందలేదని అర్థం. ఈ విధంగా మన మెదడుకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందనప్పుడే మనకు ఆవలింతలు వస్తుంటాయి.

35

అయితే చాలామందికి ఈ విషయం తెలియక తమలో ఏదో జరగబోతుందని తమకు ఇలా ఆవలింతలు వస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఎంతో మంచిది.ఇలా మెదడుకు ఆక్సిజన్ సరిగా అందలేదు అంటే అందుకు కారణం మన శ్వాసక్రియ రేటు తగ్గినట్లే ఇలా శ్వాసక్రియ రేటు ఎప్పుడు తగ్గుతుంది అంటే ఊపిరితిత్తులలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మన శ్వాసక్రియ రేటు తగ్గి మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది.

45

ఇలా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా నోటితో లేదా ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు తక్షణమే వైద్యుని సంప్రదించడం లేదా ముక్కు ద్వారా ఎక్కువగా గాలిని తీసుకుని వదులుతూ ఎక్సర్సైజులు చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మన శరీరానికి సరిపడే అంత ఆక్సిజన్ లభించి ఆవలింతలు రావడం తగ్గిపోతుంది. ఇలా ముక్కు ద్వారా ఎక్సర్ సైజ్ చేసేవారు కాఫీ మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి.
 

55

ఇకపోతే కేవలం 6 గంటలు మాత్రమే నిద్రకు కేటాయించాలి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు తరచూ పోషకాహారంతో పాటు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.ఇలా సరేనా ఆహార పదార్థాలను తీసుకొని ఎక్సర్సైజులు చేయటం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని లేకుండా ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మన శరీరంలో అన్ని అవయవాల పని తీరు సక్రమంగా ఉండటమే కాకుండా ఆవలింతలు రావడం కూడా తగ్గిపోతుంది.

click me!

Recommended Stories